Facebook Reels : ఫేస్‌బుక్‌లో కొత్త ప్రొగ్రామ్.. ఇలా Reels పెట్టారంటే డబ్బులే డబ్బులు.. నెలకు రూ. 2.5 లక్షలు పక్కా..!

Facebook Reels : కంటెంట్ క్రియేటర్లు పండగ చేస్కోండి. ఫేస్‌బుక్ సరికొత్త ప్రొగ్రామ్ అందిస్తోంది. మీరు 30 రోజుల్లో 15 రీల్స్ పోస్టు చేస్తే చాలు.. రూ. 2లక్షలకు పైగా డబ్బులు సంపాదించుకోవచ్చు.. ఎలాగంటే?

Facebook Reels

  • టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష నుంచి మిలియన్ పైగా ఫాలోవర్లు
  • క్రియేటర్లు నెలకు రూ. 83వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు సంపాదన
  • 30 రోజులలో కనీసం 15 రీల్స్‌ను పోస్ట్ చేయాలి
  • గ్యారెంటెడ్ పేమెంట్లు కేవలం 3 నెలలు మాత్రమే ఉంటాయి
  • ఆ తర్వాత మానిటైజేషన్ టూల్స్, ఎంగేజ్‌మెంట్‌పైనే సంపాదన

Facebook Reels : ఫేస్‌బుక్‌లో భారీగా డబ్బులు సంపాదించుకోవచ్చు తెలుసా? ఇది అందరికి తెలిసిందే కదా అంటారా? కంటెంట్ క్రియేటర్ల కోసం ‘క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్’అనే సరికొత్త ప్రొగ్రామ్ వచ్చింది. ఈ ప్రొగ్రామ్ కింద కేవలం రీల్స్ పోస్టు చేయడం ద్వారా మీరు నెలకు రూ. 2.5 లక్షలు సంపాదించుకోవచ్చు. కానీ, మెటా దిగ్గజం ఇందులో ఒక మెలిక పెట్టింది.. డబ్బులు ఊరికే రావు కదా మరి.

అందుకే కంటెంట్ క్రియేటర్లు రీల్స్ ఏది పడితే అది పోస్టు చేస్తానంటే ఫేస్‌బుక్‌ డబ్బులు ఇవ్వదు.. కంటెంట్ క్రియేటర్లు తప్పనిసరిగా 30 రోజుల వ్యవధిలో కనీసం 15 రీల్స్ పోస్టు చేయాల్సి ఉంటుంది. అంటే రెండు రోజులకు ఒక రీల్ కనీసం పోస్టు చేస్తే చాలు. కన్సెస్టెన్సీగా రీల్స్ చేస్తుండాలి. మెటా చెప్పినట్టు రూల్స్ పాటించిన క్రియేటర్లు భారీ మొత్తంలో రీల్స్ ద్వారా డబ్బులు రాబట్టుకోవచ్చు అనమాట.

పక్క ప్లాట్‌ఫారం క్రియేటర్లను ఆకర్షించేందుకు :
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్రధానంగా టిక్‌టాక్, యూట్యూబ్ వంటి పోటీదారు ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్ క్రియేటర్లను ఫేస్‌బుక్‌కు ఆకర్షించేందుకు ఈ కొత్త ప్రొగ్రామ్ తీసుకొచ్చింది. వారికి గ్యారెంటెడ్ పేమెంట్లు, ఐడెంటిటీని అందిస్తూ ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రొగ్రామ్ అందిస్తోంది. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉన్న క్రియేటర్లను లక్ష్యంగా చేసుకుని మెటా కంపెనీ ‘క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్’ ప్రొగ్రామ్ డిజైన్ చేసింది.

ఫేస్‌బుక్‌లో జీరో నుంచి ఫాలోవర్లను తెచ్చుకోవడం కష్టంగా భావించే క్రియేటర్ల కోసం ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు మెటా పేర్కొంది. ప్రారంభ పేమెంట్లతో పాటు, క్రియేటర్లు ఫేస్‌బుక్ కంటెంట్ మానిటైజేషన్ ప్రోగ్రామ్‌ను కూడా పొందుతారు. అలాగే, ప్లాట్‌ఫారమ్‌పై వారి రీచ్‌ను పెంచుకునేందుకు కంటిన్యూగా డిస్ట్రిబ్యూషన్ సపోర్టు కూడా లభిస్తుంది.

Read Also : Camera Phones 2026 : కొంటే ఈ కెమెరా ఫోన్లు కొనాలి.. రూ. 30వేల లోపు 6 బెస్ట్ DSLR కెమెరా ఫోన్లు.. మూడో ఫోన్ అసలు వదలొద్దు!

ఫేస్‌బుక్ నుంచి డబ్బు సంపాదన ఎలా? :
అర్హత విషయానికి వస్తే.. క్రియేటర్లు 30 రోజుల వ్యవధిలో కనీసం 15 రీల్స్‌ను పోస్ట్ చేయాలి. కనీసం (10X3) రోజులుగా డివైడ్ చేయొచ్చు. అయితే, ఆ కంటెంట్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది కానవసరం లేదు. ఒరిజినల్‌ కంటెంట్ అయితే చాలు..

ఇందులో AI-జనరేటెడ్ మెటీరియల్ కూడా ఉండొచ్చు.  కాకుంటే ఆ ఏఐ కంటెంట్ మీరు క్రియేట్ చేసింది అయి ఉండాలి.ఫేస్‌బుక్ క్రియేటర్ ఎకోసిస్టమ్‌ను పునరుద్ధరించడమే దీని లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నప్పటికీ, ఈ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్, యూట్యూబ్‌లతో పోటీ పడటంలో ఇబ్బంది పడుతోంది.

మీరు ఎంత సంపాదించొచ్చంటే? :
ఈ ప్రోగ్రామ్ ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ లేదా యూట్యూబ్‌లో కనీసం 100,000 మంది ఫాలోవర్లు ఉన్న క్రియేటర్లు నెలకు 1,000 డాలర్లు (సుమారు రూ. 83,000) వరకు సంపాదించవచ్చు. అయితే, 10 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న క్రియేటర్లు నెలకు 3,000 డాలర్లు (సుమారు రూ. 2.5 లక్షలు) వరకు పొందేందుకు అర్హులు.

ఈ గ్యారెంటెడ్ పేమెంట్లు మొదటి 3 నెలలకు మాత్రమే పరిమితమని గమనించాలి. మెటా మానిటైజేషన్ సిస్టమ్‌లో కొత్త టూల్స్ కూడా ప్రకటించింది. ఈ కొత్త టూల్స్ ఏ వ్యూకు ఎంత పేమెంట్ వస్తుంది? కొన్ని ఎందుకు ఎల్జిబుల్ కావు అనేది స్పష్టంగా క్రియేటర్లకు తెలియజేస్తుంది.