Whatsapp Recharge : వావ్.. సూపర్ ఫీచర్.. ఇక వాట్సాప్‌లోనూ మొబైల్ రీఛార్జ్‌ చేయొచ్చు.. ఎలాగంటే?

Whatsapp Recharge : వాట్సాప్ యూజర్లు ఎగిరిగంతేసే న్యూస్.. అద్భుతమైన ఫీచర్‌ వచ్చేసింది. ఇకపై జియో, ఎయిర్‌టెల్ వోడాఫోన్ ఐడియా యూజర్లు వాట్సాప్ ద్వారానే తమ మొబైల్ ఫోన్‌లను ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Whatsapp Recharge

  • వాట్సాప్‌లో బిగ్ అప్‌డేట్ ఇక రీఛార్జ్ కూడా అక్కడే
  • వాట్సాప్ వాడేవాళ్లకు గుడ్ న్యూస్.. రీఛార్జ్ ఇప్పుడు సింపుల్
  • రీఛార్జ్ కోసం బయటకి వెళ్లాల్సిన పనిలేదు.. వాట్సాప్ చాలు

Whatsapp Recharge : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లో పేమెంట్లే కాదు.. మొబైల్ రీచార్జ్ కూడా చేసుకోవచ్చు. వాట్సాప్ కేవలం చాటింగ్ యాప్ మాత్రమే కాదు.. సూపర్ యాప్‌గా మారుతోంది. భారతీయ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందిస్తోంది.

ఈ ఫీచర్ ద్వారా ఇప్పటినుంచి ప్రీపెయిడ్ మొబైల్ నంబర్‌ను నేరుగా వాట్సాప్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ యూజర్లకు ఈ సౌకర్యం లభిస్తుంది.

ఇంతకముందు రీఛార్జ్ కోసం పేటీఎం, గూగుల్ పే లేదా టెలికాం కంపెనీ యాప్ వంటి వేర్వేరు యాప్‌లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు అన్నీ వాట్సాప్‌లోనే చేయవచ్చు. ఇప్పటికే లక్షలాది మంది వాట్సాప్ పేను వాడుతున్నారు.

కానీ, ఇప్పుడు రీఛార్జ్ ఫీచర్లను కూడా వాట్సాప్ యాడ్ చేసింది. ఒకే యాప్‌లో పేమెంట్లతో పాటు రీఛార్జ్ వంటి అన్ని పనులు పూర్తి అవుతాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం దశలవారీగా రిలీజ్ అవుతోంది. వాట్సాప్ రెగ్యులర్ యూజర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.

Read Also : Best AI Tools 2026 : టాప్ క్రియేటర్లు వాడే ఫేవరెట్ AI టూల్స్ ఇవే.. మీరు ట్రై చేశారా? ఒక్కసారి వాడితే వదలరు!

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
ఈ వాట్సాప్ ఫీచర్‌ వాడటం చాలా ఈజీ.. వినియోగదారులు వాట్సాప్ పే సెక్షన్‌కు వెళ్లాలి. మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ కనిపిస్తుంది. మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఒక ప్లాన్‌ను ఎంచుకోవాలి. ఆపై యూపీఐ ద్వారా పేమెంట్ చేసి రీఛార్జ్‌ను పూర్తి చేయాలి.

ఈ మొత్తం ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. యూజర్లు వేర్వేరు యాప్‌ల మధ్య మారాల్సిన అవసరం ఉండదు. చాట్, పేమెంట్, రీఛార్జ్ అన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో ఉంటాయి. యూజర్లకు ఫుల్ టైమ్ సేవ్ అవుతుంది.

వాట్సాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ కోసం సింపుల్ ప్రాసెస్..
1.ముందుగా, ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుంచి వాట్సాప్‌ను అప్‌డేట్ చేయండి. వాట్సాప్‌ను ఓపెన్ చేసి పేమెంట్స్ సెక్షన్‌కు వెళ్లండి.
2 : ఇక్కడ మీకు ‘Mobile Recharge’ లేదా ‘Recharge’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
3 : మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మీ ఆపరేటర్ (జియో, ఎయిర్‌టెల్ లేదా Vi) ఆటోమాటిక్‌గా కనిపిస్తుంది. లేదంటే మీరు ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.
4 : స్క్రీన్‌పై కనిపించే రీఛార్జ్ ప్లాన్‌లలో ఏదైనా ఒకటి ఎంచుకోండి. ఇప్పుడు UPI (WhatsApp Pay లేదా ఇతర UPI) ద్వారా పేమెంట్ చేయండి.
5 : పేమెంట్ పూర్తయ్యాక మీ రీఛార్జ్ పూర్తవుతుంది. మీకు కన్ఫార్మేషన్ మెసేజ్ వస్తుంది.

పేటీఎం, గూగుల్ పేలకు గట్టి పోటీ :
ఇప్పటి వరకు, మొబైల్ రీఛార్జ్‌ల కోసం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌లను వాడుతూ వచ్చారు. ఈ కొత్త వాట్సాప్ ఫీచర్‌తో ఇతర డిజిటల్ యాప్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.