Apple Intelligence : ఐఫోన్ లవర్స్ కోసం అద్భుతమైన ఫీచర్.. ఈ కొత్త AI ఫీచర్.. ఫుడ్ నుంచి టికెట్ల వరకు అన్నీ స్కాన్ చేస్తుంది..!

Apple Intelligence : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం అతి త్వరలో కొత్త విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు రానున్నాయి. మీ ఐఫోన్ ఆహార పదార్థాల నుంచి టిక్కెట్ల వరకు అన్నింటినీ స్కాన్ చేయగలదు.

Apple Intelligence

  • ఆపిల్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అదుర్స్
  • ఈ కొత్త ఏఐ ఫీచర్ ఫుడ్ నుంచి టికెట్ల వరకు స్కాన్ చేస్తుంది
  • వచ్చే సెప్టెంబర్‌లో iOS 27 అప్‌డేట్‌ రిలీజ్

Apple Intelligence : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు బిగ్ గుడ్ న్యూస్.. ఏఐ (AI) రంగంలో దూసుకెళ్లేందుకు ఆపిల్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం.. ఆపిల్ అనేక కొత్త ఏఐ ఫీచర్లపై పనిచేస్తోంది. ఈ ఫీచర్ల సాయంతో ఐఫోన్ మరింత అడ్వాన్స్ కానుంది. రాబోయే ఆపిల్ iOS27 లో అనేక ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో సిస్టమ్ యాప్‌లలో మాదిరిగా కనీసం 4 ఏఐ టూల్స్ ఉంటాయి.

ఈ అప్‌డేట్‌లో రాబోతున్న విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అత్యంత ఆకర్షణీయంగా ఉండనుంది. ఈ ఏఐ ఫీచర్ ద్వారా వస్తువును గుర్తించడమే కాదు.. స్కాన్ చేసి అదేంటో పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఉదాహరణకు.. కెమెరాను ఫుడ్ వైపు చూపిస్తే.. అందులో ఎంత పోషక విలువులు ఉన్నాయో ఐఫోన్ చెబుతుంది. టికెట్లను బుక్ చేసి పెడుతుంది. ఫోన్ నెంబర్స్ వెతికి పెడుతుంది. అలాగే ఇతర పనులను వేగంగా పూర్తి చేయగలదు.

ఆపిల్ విజువల్ ఇంటెలిజెన్స్‌తో మరింత ఈజీ :
విజువల్ ఇంటెలిజెన్స్ అనేక పనులను ఈజీ చేస్తుందని భావిస్తున్నారు. వినియోగదారులు ప్రింట్ చేసిన ఫోన్ నంబర్లు, అడ్రస్ వివరాలను స్కాన్ చేసి వాటిని నేరుగా కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఆహారానికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని కూడా అందిస్తుంది. తద్వారా హెల్త్ యాప్‌లో యూజర్లకు మెరుగైన అవగాహన అందిస్తుంది.

Read Also : Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. 77 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్.. రోజుకు 1.5GB డేటా, మరెన్నో బెనిఫిట్స్!

కంపెనీ ఆపిల్ వాలెట్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయనుంది. రాబోయే అప్‌డేట్‌తో ఏఐతో ఫిజికల్ టిక్కెట్లు, జిమ్ కార్డ్‌ల వంటి వస్తువులను స్కాన్ చేసి డిజిటల్‌గా స్టోర్ చేయగలదు. ఈ విధంగా, మీరు ఫిజికల్ టిక్కెట్లు లేదా పాస్‌లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

ఏఐ వేరబుల్స్ సన్నాహాలు :
నివేదికల ప్రకారం.. ఆపిల్ iOS27లో విజువల్ ఇంటెలిజెన్స్‌పై గట్టిగా దృష్టి సారిస్తోంది. ఈ సంస్థ స్మార్ట్‌గ్లాసెస్, కెమెరాలతో ఎయిర్‌పాడ్స్, వేరబుల్ ఏఐ పెండెంట్‌లతో సహా అనేక ఏఐ వేరబుల్ డివైజ్‌లను డెవలప్ చేస్తోంది.

iOS27 అప్‌డేట్ ఎప్పుడు వస్తుంది? :
ఆపిల్ జూన్‌లో జరిగే వార్షిక టెక్ కాన్ఫరెన్స్ (WWDC)లో iOS 27 అప్‌డేట్‌ను ప్రకటించనుంది. అయితే, ఈ అప్‌డేట్ రిలీజ్ సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్ సిరీస్‌తో ప్రారంభమవుతుంది. ఈ అప్‌డేట్‌లోని అతిపెద్ద ఫీచర్ సిరి చాట్‌బాట్. ఆపిల్ ఇప్పుడు సిరిని చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని వంటి చాట్‌బాట్‌గా మార్చాలని చూస్తోంది.

ఈ ఫీచర్‌తో వినియోగదారులు సిరితో చాట్‌బాట్‌లా మాట్లాడుకోవచ్చు. ఆన్-స్క్రీన్ అవేర్‌నెస్, కాంటెక్స్ట్ అండర్‌స్టాండింగ్ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇందులో ఆపిల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు.