తెలంగాణలో కొత్తగా 206 కరోనా కేసులు, ఇద్దరు మృతి
- bheemraj
- Published On : January 18, 2021 / 01:26 PM IST
206 new corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,579 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,91,872 చేరుకున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,049గా ఉంది. గత 24 గంటల్లో 346 మంది డిశ్చార్జి అయ్యారు.
ఇప్పటి వరకు 2,86,244 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 2,281 మంది ఉన్నారు. నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 45 కేసులు నమోదు అయ్యాయి.
