Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికపై అత్యాచారం.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు.. హైదరాబాద్‌లో దారుణం
కులసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల మైనర్ బాలిక(Minor Girl Harassment)పై ఓ వ్యక్తి అమానుషంగా అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు.
- V Santhosh Kumar
- Published on- July 17, 2026 / 10:57 AM IST
9 year old girl harassment case in hyderabad kulasumpura
- మైనర్ బాలికపై అత్యాచారం
- సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు
- జనం దాడిలో నిందితుడు మృతి
Minor Girl Harassment: హైదరాబాద్ నగరంలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. కులసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అమానుషంగా అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. ఈ అకృత్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తమ చిన్నారిపై జరిగిన ఘోరాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గమనించిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు, ఆక్రోశానికి గురయ్యారు.
AP COVID Cases: ఏపీలో మళ్లీ కోవిడ్ కలకలం.. నెల రోజుల్లో 12 కేసులు.. నలుగురు మృతి
ఈ దారుణం గురించి తెలియగానే ఆగ్రహంతో ఊగిపోయిన బాలిక(Minor Girl Harassment) తల్లిదండ్రులు, స్థానికులు కలిసి నిందితుడిపై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు నిందితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ నిందితుడు మరణించాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
