General Strike : మార్చి28, 29 తేదీల్లో ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

ప్రభుత్వ రంగ ట్రేడ్ యూనియన్ నాయకులతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెబుతున్నారు.

Strike

nationwide general strike : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (పీ.ఎస్.యు) ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 28, 29 తేదీల్లో ట్రేడ్ యూనియన్స్ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ ట్రేడ్ యూనియన్ నాయకులతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెబుతున్నారు.

ట్రేడ్ యూనియన్ నాయకుల సమావేశంలో బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీ.ఎస్.యు.ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక చర్యలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు.

Privatisation of State Public Sector : ప్రైవేటీకరణ బాటలో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల(పీ.ఎస్.యు) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ ఈనెల 28, 29వ తేదీల్లో నిర్వహించనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీ.ఆర్.ఎస్.కే.వీ కార్మిక విభాగం సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది.

ఈ సదస్సులో ఐ.ఎన్.టీ.యు.సీ., ఏ.ఐ.టీ.యు.సీ., సీ.ఐ.టీ.యు., హెచ్.ఎం.ఎస్, టీ.ఆర్.ఎస్.కే.వీ., ఐ.ఎఫ్.టీ.యు., టీ.ఎన్.టీ.యు.సీ, ఏ.ఐ.యు. టీ.యు.సి, రైల్వే, బ్యాంక్, బీ.డీ.ఎల్. హెచ్.ఏ.ఎల్, బీ.హెచ్.ఇ.ఎల్., పోస్టల్, బీ.ఎస్.ఎన్.ఎల్, ఎయిర్ పోర్ట్స్ ట్రేడ్ యూనియన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.