రూ.13 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మన్నెగూడ సర్పంచ్‌

ACB officials raided Mannegooda Sarpanch : వికారాబాద్‌ జిల్లాలో ఓ సర్పంచ్‌ లంచావతారం బట్టబయలైంది. పూడూర్‌ మండలంలోని మన్నెగూడ సర్పంచ్‌ వినోద్‌గౌడ్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మన్నెగూడలో ఓ వెంచర్‌కు అనుమతులు ఇచ్చేందుకు వినోద్‌గౌడ్‌ లంచం డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇక రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. 13 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా సర్పంచ్‌ వినోద్‌గౌడ్‌ను రెడ్‌ ట్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌ షాదాన్‌ కళాశాల వద్ద.. లంచం తీసుకుండటుండగా అధికారులు దాడి చేసి సర్పంచ్‌ను పట్టుకున్నారు.

ఓ వెంచర్‌ అనుమతి కోసం 20 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశాడు. 15 డీల్‌ కుదరగా.. ఇవాళ 13 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.