ACB Raids: తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.6.87 కోట్ల ఆస్తులు స్వాధీనం.. ఇది ఎన్నోసారి తెలుసా?

ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న తహసీల్దార్‌ దేశాని శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఏడు ప్రాంతాల్లో అధికారులు (ACB Raids)గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

Acb raids on ibrahimpatnam dao tahsildar desani srinivas reddy

  • ఏసీబీ దాడుల్లో అక్రమాస్తుల వెలికితీత
  • డిఏవో వద్ద కోట్ల ఆస్తులు
  • తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు

ACB Raids: తెలుగు రాష్ట్రాల్లో అవినీతి అధికారుల అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తహసీల్దార్‌ దేశాని శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఏడు ప్రాంతాల్లో అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు (ACB Raids)నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

CNG Cylinder Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. పేలిన సీఎన్‌జీ సిలిండర్.. ముగ్గురు దుర్మరణం!

కోట్ల విలువైన ప్లాట్లు, నివాసాలు, బంగారం స్వాధీనం:

ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.6.87 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించినప్పటికీ, మార్కెట్ విలువలో ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కర్మన్‌ఘాట్‌లో రెండు ఫ్లాట్లు (రూ.2.60 కోట్లు), జీ+3 పెంట్‌హౌస్ (రూ.1.60 కోట్లు), యాచారంలో 10 ఎకరాల భూమి, పలు చోట్ల 8 ఓపెన్ ప్లాట్లతో పాటు బాలాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో రూ.86 లక్షల పెట్టుబడులను గుర్తించారు. ఇంకా రూ.4 లక్షల నగదు, 680 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.59 లక్షల విలువైన వాహనాలు, బ్యాంకు డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు.

2009లోనే కేసు.. మళ్లీ పట్టుబడిన తహసీల్దార్:

శ్రీనివాస్‌రెడ్డిపై ఇలాంటి కేసు నమోదు కావడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2009లో మహేశ్వరం మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆయనపై మొదటిసారిగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. గత చరిత్ర ఉన్నప్పటికీ తిరిగి అదే స్థాయిలో అక్రమాలకు పాల్పడటంపై అధికారులతో పాటు ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం లాకర్లు, ఇతర పత్రాలపై అధికారులు మరిన్ని సోదాలు నిర్వహిస్తున్నారు.