Acid Attack : వేములవాడలో దారుణం.. చికెన్‌ సెంటర్‌ నిర్వహకులపై యాసిడ్ దాడి

చికెన్ సెంటర్ నిర్వాహకులపై యాసిడ్ దాడి చేశారు. యాసిడ్‌ దాడిలో గాయపడ్డ బాధితుడి పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

Chicken

Acid attack on chicken center operators : చికెన్‌ ముక్క రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్‌లో దారుణ ఘటన జరిగింది. చికెన్‌ వాసన వస్తోందంటూ ప్రశ్నిచడంతో.. అది కాస్త గొడవకు దారి తీసింది. మాట మాట పెరగడంతో షాపు యజమానిపై దాడికి దిగారు.

అయితే చికెన్‌ సెంటర్‌ వర్గం కూడా తిరిగి దాడి చేయడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ముందు చిన్న గొడవగా మొదలైన రచ్చ.. ఆ తర్వాత యాసిడ్‌ దాడి చేసుకునే వరకు వెళ్లింది.

Chicken Curry : కోడికూర వండలేదని భార్యను కొట్టి చంపిన భర్త

చికెన్ సెంటర్ నిర్వాహకులపై యాసిడ్ దాడి చేశారు. యాసిడ్‌ దాడిలో గాయపడ్డ బాధితుడి పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.