Traffic Rules : వాహనదారులకు బిగ్ అలర్ట్.. చలాన్లు చెల్లించడం లేదా.. అయితే, మీకు ఇబ్బందులు తప్పవ్..

Traffic Rules : కేంద్ర మోటార్ వాహన నిబంధనలకు అనుగుణంగా జరిమానాలపై వచ్చే అభ్యంతరాలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే వెలువడనున్నట్లు రవాణాశాఖ వర్గాల నుంచి సమాచారం.

Traffic Rules

  • తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అలర్ట్
  • చలాన్లు చెల్లించకపోతే ఇక ఇబ్బందులే
  • డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్

Traffic Rules : తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను సీరియస్‌గా తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ చలాన్ల వసూలు, వివాదాల పరిష్కారంకోసం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఏడాదికి ఐదు కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది.

Also Read : Gold Price Today : భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. కారణాలు ఇవే.. గోల్డ్ రేటు ఇంకా తగ్గుతుందా..? ఫుల్ డీటెయిల్స్

కేంద్ర మోటార్ వాహన నిబంధనలకు అనుగుణంగా జరిమానాలపై వచ్చే అభ్యంతరాలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే వెలువడనున్నట్లు రవాణాశాఖ వర్గాల నుంచి సమాచారం. ఈ కొత్త విధానం ప్రకారం.. ట్రాఫిక్ చలాన్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాహనదారులు ఆఫ్‌లైన్ దరఖాస్తులకు అవకాశం ఉండదు. కేవలం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే తమ ఫిర్యాదులను నమోదు చేయాల్సి ఉంటుంది.

చలాన్ల జారీ, పరిష్కారం ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయించింది. కెమెరా ఆధారిత చలాన్లను మూడు రోజుల్లోగా, మాన్యువల్ చలాన్లను 15రోజుల్లోగా వాహనదారులకు పంపాలి. చలాన్ అందిన 45 రోజుల్లోపు వాహనదారుడు జరిమానా చెల్లించాలి లేదంటే అభ్యంతరాన్ని దాఖలు చేయాలి. ఫిర్యాదు అందిన 30 రోజుల్లోపు అధికారులు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారు. ఒకవేళ అధికారుల నిర్ణయంతో ఏకీభవించకపోతే చలాన్ మొత్తంలో 50 శాతం చెల్లించి కోర్టును ఆశ్రయించే వెసులుబాటు కూడా కల్పించారు. కోర్టు నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి.

ఒకవేళ చలాన్లు చెల్లించకుంటే కఠిన చర్యలు ఉంటాయి. ఏడాదికి ఐదు కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్సింగ్ అథారిటీ అయిన రవాణాశాఖకు అలెర్ట్ వెళ్తుంది. దీంతో వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్సును లేదంటే వాహనం ఆర్సీని అధికారులు బ్లాక్ చేస్తారు. పెండింగ్ చలాన్లు చెల్లిస్తేనే ఆర్టీఏ సేవలు తిరిగి యాక్టివేట్ అవుతాయి. తుది నోటిపికేషన్ లో పోర్టల్ వివరాలు, ఇతర పూర్తి సమాచారాన్ని అధికారులు వెల్లడిస్తారు. ఈ కఠిన నిబంధనల ద్వారా రహదారి భద్రతను మెరుగుపర్చడంతోపాటు వాహనదారుల్లో బాధ్యతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.