Best Redmi Smartphone Deals : అమెజాన్ సేల్‌లో రెడ్‌మి ఫోన్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. బ్యాంకు ఆఫర్లతో రూ.15 వేల వరకు ఆదా!
Best Redmi Smartphone Deals : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026లో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. రెడ్‌మి ఏ7 ప్రో 5జీ, 15సీ 5జీ, 17 5జీ, టర్బో 5 ధరలు, బ్యాటరీ సామర్థ్యం, కెమెరా వివరాలు, బ్యాంక్ ఆఫర్లు ఏంటో ఓసారి చూద్దాం..
- Sreehari A
- Published on- October 12, 2026 / 07:35 PM IST
Redmi Smartphone Offers
- 7,900mAh బ్యాటరీతో రెడ్‌మి ఫోన్..
- అమెజాన్‌లో 4 మోడళ్లపై అదిరిపోయే ఆఫర్లు
- ఈ మోడళ్ల ధరలు, ఆఫర్లపై ఓసారి చూడండి
- రెడ్‌మి ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లు, రూ.15 వేల వరకు ఆదా
Best Redmi Smartphone Deals : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీరు రెడ్‌మి లవర్స్ అయితే ఇది మీకోసమే.. సరసమైన ధరలో కొత్త రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటే ఇంతకన్నా బెస్ట్ టైమ్ ఉండదు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026లో అనేక ఆఫర్లు ఊరిస్తున్నాయి. రెడ్‌మి నాలుగు ఫోన్లు భారీ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులు, ఇతర పేమెంట్ మెథడ్స్ ద్వారా అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. పూర్తి ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలివే..
రెడ్‌మి ఏ7 ప్రో 5జీ :
ఈ ఫోన్ అసలు ధర రూ.27,999 కాగా, సేల్‌లో రూ.15,497కే లభిస్తోంది. అసలు ధరపై 45 శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులతో ఈఎంఐలో కొనుగోలు చేస్తే మరో రూ.900 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో 6,300mAh బ్యాటరీ, 32MP కెమెరా, 64GB స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి.
రెడ్‌మి 15సీ 5జీ ప్రైమ్ ఎడిషన్ :
రూ.31,999 అసలు ధర నుంచి ఈ ఫోన్‌ను రూ.17,999కు కొనుగోలు చేయొచ్చు. అంటే 44 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా చెల్లిస్తే అదనంగా రూ.900 ఆదా చేయొచ్చు. ఇందులో 6.9 అంగుళాల డిస్ ప్లే, 6,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి.
రెడ్‌మి 17 5జీ :
ఈ మోడల్ అసలు ధర రూ.39,999 కాగా, సేల్ ధర రూ.23,998గా ఉంది. దాదాపు 40 శాతం తగ్గింపు లభిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే మరో రూ.1,000 ఆదా చేసుకోవచ్చు. ఇందులో 6.9 అంగుళాల డిస్ ప్లే, 7,900mAh బ్యాటరీ, ఏఐ ఆధారిత ఫీచర్లతో 50MP డ్యూయల్ కెమెరా ఉన్నాయి.
రెడ్‌మి టర్బో 5 :
ఈ ఫోన్ అసలు ధర రూ.54,999 నుంచి రూ.40,999కు తగ్గింది. 25 శాతం తగ్గింపుతో రూ.2,000 కూపన్ బెనిఫిట్ కూడా ఉంది. ఎస్‌బీఐ కార్డుతో కొంటే మరో రూ.1,500 ఆదా అవుతుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ 6.59 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 7,540mAh బ్యాటరీ, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP సోనీ కెమెరా ఉన్నాయి. కొనుగోలు చేసే ముందు ఫైనల్ ధర, బ్యాంకు అర్హతలు, కూపన్ వివరాలను అమెజాన్‌లో చెక్ చేయడం బెటర్..
