కరోనా వ్యాక్సిన్ వేసుకున్న అంగన్ వాడీ టీచర్ మృతి

  • Published On : February 10, 2021 / 11:18 AM IST

Anganwadi teacher killed by corona vaccine : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దఫా పూర్తై, రెండో దఫా కొనసాగుతోంది. వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతంగానే కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న చాలా మంది ఆరోగ్యంగానే ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొద్దిరోజులకు కొంతమంది మృతి చెందుతున్నారు. మరికొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ఓ అంగన్ వాడీ టీచర్ మరణించారు. నందిపాడులో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న 4 రోజుల తర్వాత అంగన్ వాడీ టీచర్ మృతి చెందారు. అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తున్న నాగమణి అనే మహిళ నాలుగు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. దీంతో కరోనా వ్యాక్సిన్ పై భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు.