Sangareddy Dist : భర్తపై కోపంతో అంగన్వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసి.. అమానుష ఘటన.. ఐదుగురిపై కేసు నమోదు

Sangareddy Dist : సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తించారు. ఆమెను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు.

Anganwadi Teacher

  • సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన
  • అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన కొందరు గ్రామస్తులు
  • ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Sangareddy Dist : సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తించారు. ఏ తప్పూ చేయని ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. భర్త చేసిన తప్పుకు ఆమెను బాధ్యురాలిని చేస్తూ చెట్టుకు కంటేసి చిత్ర హింసలకు గురిచేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసిన విచారణ చేస్తున్నారు.

Also Read : Obesity Problem : వామ్మో.. హైదరాబాద్‌ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఊబకాయుల సంఖ్య పెరిగిపోతోంది.. ఏకంగా 81శాతం మందికి.. తాజా నివేదికలో సంచలన విషయాలు

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దామరగిద్ద గ్రామానికి చెందిన వంసతకుమారి రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తుంది. వసంతకుమారి భర్త ప్రభాకర్ ఇటీవల హెచ్‌బీఎం ఫైనాన్స్‌ పేరుతో గ్రామానికి చెందిన ఆవుటి సాయవ్వ, చాకలి బాలామణి, భూతాలే వైద్యనాథ్, ఆవుటి బండ్వప్ప, కోటగిరి రాములు వద్ద డబ్బులు తీసుకొని మోసగించి పారిపోయాడు. అయితే, మంగళవారం విధులకు హాజరైన ప్రభాకర్ భార్య, అంగన్వాడీ టీచర్ వసంతకుమారిని కొందరు గ్రామస్తులు చెట్టుకు తాళ్లతో కట్టేసి అవమానపర్చారు. చిత్రహింసలకు గురిచేశారు.

కొద్దిసేపటి తరువాత గ్రామ పెద్దల జోక్యంతో వసంతకుమారిని విడిచిపెట్టారు. ఈ విషయంపై వసంత కుమారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అంగన్వాడీ టీచర్ వసంతకుమారిని చెట్టుకు కట్టేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తప్పు చేసింది భర్త అయితే మహిళను ఎలా చిత్రహింసలకు గురిచేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళను చెట్టుకు కట్టేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.