Cyber Cheating : హైదరాబాద్ లో మరో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ క్రిమినల్స్ చేతిలో ఓ మహిళ మోసపోయింది. పూజల పేరుతో సైబర్ క్రిమినల్స్ ఓ మహిళ నుంచి రూ.47లక్షలు కాజేశారు. సమస్యలు తొలగిపోవాలంటే ఏం చేయాలి అని హైదరాబాద్ కు చెందిన మహిళ గూగుల్ లో సెర్చ్ చేసింది. ఆమెకు హర్యానాకు చెందిన బాబాను అంటూ ఫోన్ చేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
సమస్యలు తీరడానికి పూజలు చేస్తున్నానని మహిళకు ఫొటోలు పంపించాడు. ఇలా విడతల వారిగా బాబా మహిళ నుంచి రూ.47లక్షలు వసూలు చేశాడు. అయినా సమస్యలు తీరకపోవడంతో బాబాకు ఫోన్ చేశారు మహిళ. ఫోన్ ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.