SP Balu Statue Row: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ దూరం.. కారణం అదేనా?

తెలంగాణ సాంస్కృతిక వేదిక దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడంపై తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

SP Balu Statue Row: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ దూరం.. కారణం అదేనా?

Updated On : December 15, 2025 / 5:01 PM IST

SP Balu Statue Row: హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారు. సీఎం చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ, విగ్రహం చుట్టూ వివాదం నెలకొనడం, ఇటు ఢిల్లీ పర్యటనలో ఉండటంతో రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎస్పీబీ విగ్రహావిష్కరణపై వివాదం కొనసాగుతోంది. తెలంగాణ సాంస్కృతిక వేదిక దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడంపై తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమ గీతాన్ని పాడేందుకు నిరాకరించిన వ్యక్తి విగ్రహం తెలంగాణ సాంస్కృతిక వేదిక దగ్గర పెట్టడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఎస్పీబీ విగ్రహం ఏర్పాటుకు వేరే స్థలం చూసుకోవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ కళాకారుల విగ్రహాలు మాత్రమే పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు భద్రత కల్పించారు.

రవీంద్రభారతిలో ఏర్పాటు చేసింది కాంస్య విగ్రహం. 7.2 అడుగులు ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని తయారు చేయించారు.

Also Read: ఇందిరమ్మ లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడాలంటే ఈ కార్డు పక్కాగా ఉండాలి..