Indiramma Houses : ఇందిరమ్మ లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడాలంటే ఈ కార్డు పక్కాగా ఉండాలి..
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉపాధి జాబ్ కార్డును లింక్ చేయడం సమస్యగా మారింది. అనేక మంది లబ్ధిదారులకు జాబ్ కార్డు
Indiramma Housing Scheme
Indiramma Houses : రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా విడుతల వారిగా గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంకు ఆర్థిక సహాయం అందిస్తుంది. తొలి విడతలో సుమారు నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఇవన్నీ వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.
Also Read : Ration Card : రేషన్ కార్డు దారులకు బిగ్ షాకింగ్ న్యూస్.. అలా చేయకుంటే రేషన్ కట్..! హెచ్చరికలు జారీ..
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా లబ్ధిదారుడికి రూ. 5లక్షలు నగదు అందజేస్తోంది. విడత వారీగా ఈ నగదును సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే, రూ.60వేలు మొత్తాన్ని ఉపాధిహామీ పథకం ద్వారా కూలి, శ్రమ రూపంలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.4.40 లక్షలు విడతల వారిగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే, రూ.60వేల మొత్తాన్ని ఉపాధి హామీ పథకం కింద శౌచాలయం నిర్మాణం, కూలీల వేతనం కింద చెల్లిస్తారు. అయితే, ఆ మొత్తాన్ని పొందాలంటే ఇంటి లబ్ధిదారులకు ఉపాధి హామీ జాబ్ కార్డు తప్పనిసరిగా మారింది.
తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది కాలంగా కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయడం లేదు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన రెండు ప్రధాన పథకాలకు (ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం) ఈ జాబ్ కార్డు సమస్య అడ్డంకిగా మారింది. కొత్త జాబ్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు వస్తున్నప్పటికీ.. ఏడాదిగా కొత్త కార్డులు మంజూరుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉపాధి జాబ్ కార్డును లింక్ చేయడం సమస్యగా మారింది. అనేక మంది లబ్ధిదారులకు జాబ్ కార్డు లేదు. కొత్త జాబ్ కార్డు ఇవ్వడం లేదు. దీంతో రూ.60వేల బిల్లు ఎలా చెల్లిస్తారోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఈ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కుటుంబంలో ఎవరికి జాబ్‌కార్డు ఉన్నా.. దానిలో ఇంటి యజమాని పేరును కూలీగా చేర్చి ఆ కార్డు ద్వారా రూ. 60 వేల బిల్లును మంజూరు చేస్తున్నారు. అయితే కుటుంబంలో ఎవరికీ జాబ్‌కార్డు లేని నిరుపేదలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కారం కోసం అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
