AP-TG Rains : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. వచ్చే మూడ్రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..

AP-TG Rains Weather Report : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. వాతావరణ శాఖ వర్షాలపై కీలక సమాచారం ఇచ్చింది.

AP-TG Rains : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. వాతావరణ శాఖ వర్షాలపై కీలక సమాచారం ఇచ్చింది. వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని, ఈదురుగాలులతోపాటు.. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : Youtuber Nandana : యూట్యూబర్ ‘నందన’ అరెస్ట్.. విదేశాల నుంచి రాగానే అదుపులోకి..

దక్షిణ తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సుమద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ఇవాళ కూడా కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని.. అయితే, 13 నుంచి 17 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 12 నుంచే రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు ప్రారంభమవుతాయి. పండుగ సమయానికి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

వర్షాలు పడే సమయంలో, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, పెద్దపెద్ద హోర్డింగులు ఉన్న ప్రాంతాల్లో వేచిఉండొద్దని అధికారులు సూచించారు.