AP Government : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ నుంచి వచ్చినవారికి భారీ ఊరట!

AP Government : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న తెలంగాణ అభ్యర్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.

AP Government

AP Government : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న తెలంగాణ అభ్యర్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఇకపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే తెలంగాణ నుంచి వచ్చిన అభ్యర్థులు మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో డీఎస్సీ, ఏపీపీఎస్సీ సహా వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మేలు కలగనుంది.

Also Read : Nithya Raman : లాస్ ఏంజెలెస్ మేయర్‌గా భారత సంతతి మహిళ.. సిట్టింగ్ మేయర్‌కు షాక్ ఇచ్చిన నిత్యా రామన్!

గతంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉండేది. ఈ నిబంధనను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, డీఎస్సీ (DSC), ఏపీపీఎస్సీ (APPSC), పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన నియామకాలకు ఈ విధానం వర్తించనుంది.

2024 జూన్ 1వ తేదీ నాటికి లేదా అంతకంటే ముందే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన అభ్యర్థులకు ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం నిర్దేశిత గడువులోగా ఏపీకి వలస వచ్చినట్లు ధ్రువీకరించే సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక ప్రక్రియలో ఊరట లభించనుంది.