Congress : కాంగ్రెస్‌కు బిగ్ రిలీఫ్.. రెబల్స్‌తో చర్చలు సఫలం, మల్లు రవిపై దాడికి యత్నం, పటేల్ రమేశ్ రెడ్డి కంటతడి

Big Relief For Congress : క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీకి కట్టుబడి నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు పటేల్ రమేశ్ రెడ్డి వెల్లడించారు.

Congress : కాంగ్రెస్‌కు బిగ్ రిలీఫ్.. రెబల్స్‌తో చర్చలు సఫలం, మల్లు రవిపై దాడికి యత్నం, పటేల్ రమేశ్ రెడ్డి కంటతడి

Big Relief For Congress

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీఫ్ దక్కింది. రెబల్స్ టెన్షన్ నుంచి కాంగ్రెస్ బయటపడింది. రెబల్స్ తో కాంగ్రెస్ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వారిని బుజ్జగించడంలో హస్తం పార్టీ పెద్దలు సక్సెస్ అయ్యారు. అధిష్టానంతో చర్చల తర్వాత పలువురు నేతలు తమ నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. బరిలో నుంచి తప్పుకున్న నేతలకు తర్వాత పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో పలువురు నాయకులు తమ నామినేషన్స్ విత్ డ్రా చేసుకున్నారు.

నామినేషన్ విత్ డ్రా చేసుకున్న నేతలు..

సూర్యాపేట – పటేల్ రమేశ్ రెడ్డి

జుక్కల్ – గంగారం

బాన్సువాడ – కాసుల బాలరాజు

డోర్నకల్ – నెహ్రూ నాయక్

వరంగల్ వెస్ట్ – జంగా రాఘవ రెడ్డి

ఇబ్రహీంపట్నం – దండెం రాంరెడ్డి

Also Read : సీఎం కేసీఆర్‌పై హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత

మల్లు రవిపై దాడికి యత్నం, పటేల్ రమేశ్ రెడ్డి కన్నీటిపర్యంతం..
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేశ్ రెడ్డి తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు హామీ ఇచ్చింది. కాగా, నామినేషన్ విత్ డ్రాకు వెళ్లకుండా పటేల్ రమేశ్ రెడ్డి, మల్లు రవిని అనుచరులు అడ్డుకున్నారు. మల్లు రవిపై రమేశ్ రెడ్డి అనుచరులు దాడికి యత్నించారు. నామినేషన్ విత్ డ్రా తర్వాత తన టైమ్ బాగోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు రమేశ్ రెడ్డి. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీకి కట్టుబడి నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు పటేల్ రమేశ్ రెడ్డి వెల్లడించారు.

Also Read : కేసీఆర్ అలా చేస్తే కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ నుంచి తప్పుకుంటా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సూర్యాపేటలో కాంగ్రెస్ బుజ్జగింపులు ఫలించాయి. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్దమైన పటేల్ రమేశ్ రెడ్డి అధిష్టానం హామీతో వెనక్కి తగ్గారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇవ్వడంతో నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. అంతకుముందు రమేశ్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తనను బుజ్జగించేందుకు వెళ్లిన మల్లు రవిని ఆలింగనం చేసుకుని పటేల్ రమేశ్ రెడ్డి కన్నీటిపర్యంతం అయ్యారు. మరోవైపు రమేశ్ రెడ్డి అనుచరులు గో బ్యాక్ అంటూ మల్లు రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి రాతపూర్వక హామీతో పటేల్ రమేశ్ రెడ్డి అనుచరులు వెనక్కితగ్గారు.