Revanth Reddy : కేసీఆర్ అలాచేస్తే కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ నుంచి తప్పుకుంటా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కామారెడ్డి నియోజకవర్గం నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికూడా నామినేషన్ వేశారు.

Revanth Reddy and KCR
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో పార్టీల అభ్యర్థులు ప్రచార పర్వంలో జోరు పెంచారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారిగా బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రతిపక్షాలపై విమర్శల డోస్ ను పెంచేశారు. మరోవైపు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిసైతం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సవాల్ చేశారు.
Also Read : లిక్కర్ కేసు నుంచి తను ధరించే చీర దాకా ఆసక్తికర విషయాలు చెప్పిన కవిత
అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కామారెడ్డి నియోజకవర్గం నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికూడా నామినేషన్ వేశారు. రేవంత్ కొడంగల్ నియోజకవర్గంతో పాటు కేసీఆర్ పై పోటీగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచాడు. నామినేషన్ సైతం దాఖలు చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ చేశారు. 24గంటల ఉచిత విద్యుత్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు రావాలని అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే కొండగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ ఉపసంహరించుకుంటానని రేవంత్ సవాల్ చేశారు. నామినేషన్ ఉపసంహరణ సమయానికి లాగ్ బుక్ లు తీసుకొని కేసీఆర్ కామారెడ్డి రావాలని రేవంత్ సవాల్ విసిరారు.
https://twitter.com/KP_Aashish/status/1724679239264534533?s=20