MLC Kavitha : లిక్కర్ కేసు నుంచి తను ధరించే చీర దాకా ఆసక్తికర విషయాలు చెప్పిన కవిత

ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి తను కట్టుకునే చీర వరకు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

MLC Kavitha : లిక్కర్ కేసు నుంచి తను ధరించే చీర దాకా ఆసక్తికర విషయాలు చెప్పిన కవిత

MLC Kavitha

Updated On : November 15, 2023 / 11:59 AM IST

MLC Kavitha : బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియాతో ఆసక్తిక విషయాలు మాట్లాడారు. ఢిల్లీ  లిక్కర్ కేసు నుంచి తను ధరించే చీర వరకు ఆమె చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

రాజకీయనాయకురాలిగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు చీరలు ధరించడానికి ఇష్టపడతానని అన్నారు ఎమ్మెల్సీ కవిత. అందరిలో ఒకరిగా ఉండటం వల్లే వాళ్లు దగ్గరకి వస్తారని.. ప్రేమతో హగ్ చేసుకుంటారని అన్నారు. తనకు ఏ స్టైలిష్ లేరని .. తను ఎక్కువగా సౌతిండియన్ చీరలు కట్టుకోవడానికి ఇష్టపడతానని చెప్పారు.

MLC Kavitha : నిన్న స్కూటీపై .. ఈరోజు స్వయంగా కారు నడుపుతు ఎమ్మెల్సీ కవిత..

తాను సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని రాజకీయ నాయకురాలిగా ఇంకా ఎదిగే క్రమంలో ఉన్నానని అన్నారు కవిత. గెలుపోటముల అనుభవంలో పార్టీలో ఇంకా ఎదిగే క్రమంలో ఉన్నానని.. రాష్ట్రానికి నాయత్వం వహించే అభ్యర్ధిగా పార్టీ భావించే సమయం ఇంకా ఉందని అన్నారామె.

ఢిల్లీ ఎక్సైజ్ కేసులో ప్రశ్నలు ఎదుర్కుంటున్న కవిత దర్యాప్తు కోసం తనను పిలిచిన ప్రతి సారి తన కుటుంబం ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంటుందని చెప్పారు. తనను అరెస్టు చేస్తారని వార్తలు వచ్చినప్పుడు తన కుటుంబం ఎంతో ఆందోళన పడుతుందనిని అన్నారు. పినరయి విజయన్, అశోక్ గెహ్లాట్ వంటి పొలిటీషియన్స్‌ను తాను అభిమానిస్తానని వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని కవిత అన్నారు.

BRS MLC Kavitha : ట్రాఫిక్ జామ్.. స్కూటీపై నామినేషన్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. వీడియో వైరల్

ఉదయాన్నే నిద్ర లేచి యోగ చేస్తానని భగవంతుడిని నమ్ముతానని పూజలు చేస్తానని అన్నారు కవిత. అటు కుటుంబం.. ఇటు రాజకీయాలు రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో కవిత చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.