MLC Kavitha : నిన్న స్కూటీపై .. ఈరోజు స్వయంగా కారు నడుపుతు ఎమ్మెల్సీ కవిత..

నిన్న స్కూటీపై, ఈరోజు స్వయంగా కారు నడుపుతు ఎమ్మెల్సీ కవిత ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

MLC Kavitha : నిన్న స్కూటీపై .. ఈరోజు స్వయంగా కారు నడుపుతు ఎమ్మెల్సీ కవిత..

brs mlc kavitha drove the car herself

Updated On : November 10, 2023 / 1:23 PM IST

brs mlc kavitha drove the car herself : ఎన్నికలు వచ్చాయంటే చాలు నేతలు ఎన్నెన్సో సిత్రాలు చేస్తుంటారు. ప్రజల్లోకొచ్చి సరికొత్తగా కనిపిస్తుంటారు. ప్రజలతో కలిసిపోతుంటారు. ఇదంతా ఓట్ల కోసమే అయినా దానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న స్కూటీపై ప్రయాణించారు. ఈ రోజు స్వయంగా ఆమే కారు డ్రైవ్ చేస్తు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

నిన్న నిజామాబాద్ జిల్లా బోధన్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్‌ బోధన్‌ ఆర్‌వో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేయటానికి ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలికి ఎమ్మెల్సీ కవిత రావాల్సి ఉంది. కానీ ఆమె కారులో వెళ్తుండగా దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కవిత ర్యాలీలో పాల్గొందుకు కారు దిగి స్కూటీపై ప్రయాణించారు. ఓ వ్యక్తి స్కూటీని నడుపుతుండగా కవిత వెనుకాల కూర్చొని ప్రయాణించారు. ఓ సామాన్యురాలిగా కవిత స్కూటీపై వెళ్తుండటం చూసిన స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆమెకు అభివాదం చేసేందుకు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

BRS MLC Kavitha : ట్రాఫిక్ జామ్.. స్కూటీపై నామినేషన్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. వీడియో వైరల్

ఈరోజు నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో స్వయంగా కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత మరోసారి వైరల్ అవుతున్నారు. నిన్న స్కూటీపై..ఈరోజు స్వయంగా కారు నడిపి కవిత సరికొత్తగా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.