High Court : సీఎం కేసీఆర్‌పై హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం కేసీఆఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

High Court : సీఎం కేసీఆర్‌పై హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత

Balmuri Venkat Files Petition Against CM KCR

Updated On : November 15, 2023 / 5:01 PM IST

Balmuri Venkat Petition On CM KCR : సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ బాన్సువాడలో నిర్వహించిన సభలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు అంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రసంగం తరువాత కాంగ్రెస్ నేతలపై దాడులు పెరిగాయని ఈ చర్యలు రెచ్చగొట్టినట్లుగా చేసిన ప్రసంగం ప్రభావమేనని పేర్కొన్నారు. బల్మూరి వెంటక్ దాఖలు చేసిన పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రసంగంలో విద్వేష ప్రసంగాలు చేయటంతో చర్యలు తీసుకోవాలని కోరారు.

కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని కోర్టు అయినా పట్టించుకుని న్యాయం చేయాలని కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. బాన్సువాడ సభలో కేసీఆర్ మాట్లాడిన వాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.