Congress Manifesto : తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల.. హస్తం పార్టీ 66 వరాలు

Congress Abhaya Hastham Manifesto for 2023 Election: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మ్యానిఫెస్టో విడుదల చేశారు.

Telangana Congress Manifesto : అభయహస్తం పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మ్యానిఫెస్టో విడుదల చేశారు. 42 పేజీల కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో 66 కీలక అంశాలను పొందుపర్చారు. 6 గ్యారంటీలకు అనుబంధంగా 66 హామీలిచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ముఖ్యనాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ మ్యానిఫెస్టో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 17 Nov 2023 06:01 PM (IST)

    మధ్యప్రదేశ్ లో ముగిసిన పోలింగ్

    మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 6 గంటలలోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.

  • 17 Nov 2023 06:00 PM (IST)

    సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ వివరాలు ఇవే

    సాయంత్రం 5 గంటల వరకు, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల రెండవ దశలో 67.34% ఓటింగ్ జరిగింది. మధ్యప్రదేశ్‌లో 71.11% ఓటింగ్ నమోదైంది.

  • 17 Nov 2023 04:48 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ వివరాలు ఇవే

    మధ్యాహ్నం 3 గంటల వరకు ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఓటింగ్‌లో 55.31%, మధ్యప్రదేశ్‌లో 60.52% పోలింగ్ నమోదైంది.

  • 17 Nov 2023 01:17 PM (IST)

    కాంగ్రెస్ మ్యానిఫెస్టో ముఖ్యంశాలు

    వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌
    ఆరు నెలల్లోగా మెగా డీఎస్సీతో అన్ని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
    నిర్ణీత కాలంలో 2 లక్షల ఖాళీ పోస్టుల భర్తీ
    ప్రతి విద్యార్థికి ఫ్రీ ఇంటర్నెట్‌, వైఫై సౌకర్యం
    బాసర ట్రిపుల్‌ ఐటీ తరహాలో రాష్ట్రంలో మరో నాలుగు ట్రిపుల్‌ ఐటీలు
    ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు

    ఆరోగ్యశ్రీ పథకం కింద మోకాలు సర్జరీ
    గ్రామ పంచాయితీ వార్డు మెంబర్ల గౌరవ వేతనం నెలకు రూ. 1500
    మాజీ సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్‌
    ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ మూడు DAల తక్షణ చెల్లింపు
    CPS విధానాన్ని రద్దు చేసి OPC విధానం అమలు

    అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన 66 వరాలు ఇవే.. ఇక్కడ క్లిక్ చేయండి

    ప్రభుత్వ ఉద్యోగులకు, RTC సిబ్బందికి కొత్త PRC
    ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12 వేలు ఆర్థిక సాయం
    పెండింగ్‌లో వున్న అన్ని ట్రాఫిక్‌ చలానాలు 50 శాతం రాయితీతో పరిష్కారం
    బెల్ట్‌ షాపులు పూర్తిగా రద్దు
    కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్‌లు

    రైతులకు రూ. 2 లక్షల పంట రుణ మాఫీ
    జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌లు
    ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొ. జయశంకర్‌ పేరిట బీసీ భవన్‌
    జనగాం జిల్లాకు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ పేరు
    వెనుకబడిన తరగతులకు (బీసీ) సబ్‌ ప్లాన్‌ అమలు

    పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 'బంగారు తల్లి' పథకం పునరుద్ధరణ
    18 ఏళ్లుపైబడి చదువుకునే ప్రతి యువతికీ ఉచితంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు
    అన్ని జిల్లా కేంద్రాల్లో ఓల్డేజ్‌ హోమ్స్‌
    మరణించిన జర్నలిస్ట్‌ కుటుంబాలకు రూ. 5 లక్షలు
    ప్రజా పంపిణీ రేషన్‌ డీలర్లకు రూ. 5 వేలు గౌరవ వేతనం

    తెల్ల రేషన్‌ కార్డులపై సన్నబియ్యం
    దివ్యాంగుల నెలవారీ పెన్షన్‌ రూ. 6 వేలకు పెంపు
    అంగన్‌వాడీ టీచర్లకు నెలసరి జీతం రూ. 18 వేలు
    ఆస్తి పన్ను, ఇంటిపన్ను బకాయిల పెనాల్టీ రద్దు

  • 17 Nov 2023 12:56 PM (IST)

    తెలంగాణ ప్రజలకు అంకితం: రేవంత్

    తమ పార్టీ మ్యానిఫెస్టోను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వమతాలకు హామీ పత్రంగా మ్యానిఫెస్టోను వర్ణించారు. మ్యానిఫెస్టోను విడుదల చేసినందుకు మల్లికార్జున్ ఖర్గేకు ధన్యవాదాలు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ సునామీ సృష్టించబోతోందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ కాలరాశారని, పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శించారు. పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారని, వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారని, మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారని, ఇందిరమ్మ
    రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని రేవంత్ అన్నారు.

    అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన 66 వరాలు ఇవే.. ఇక్కడ క్లిక్ చేయండి

  • 17 Nov 2023 11:38 AM (IST)

    టీపీసీసీ ముఖ్య నేతలతో భేటీ అయిన మల్లికార్జున ఖర్గే

    హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో టీపీసీసీ ముఖ్య నేతలతో మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి, ఇతర ముఖ్య నేతలు ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రచార సరళీ, మ్యానిఫెస్టోపై ఖర్గేకు రాష్ట్ర నేతలు వివరించారు. సాయంత్రం ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.

  • 17 Nov 2023 10:35 AM (IST)

    హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

    ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఖర్గే బేగం పేట విమానాశ్రయానికి వచ్చారు. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్, టీపీసీసీ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికారు.

  • 17 Nov 2023 10:25 AM (IST)

    మ్యానిఫెస్టోలో ఏం ఉండబోతున్నాయంటే..

    అమ్మహస్తం పేరు తో 9 నిత్యావసర వస్తువుల పంపిణీ
    అభయ హస్తం పథకం పునరుద్ధరణ
    ఆర్ఎంపీ, పీఏంపీలకు గుర్తింపు కార్డు
    ఎంబీసీ లకు ప్రత్యేక కార్పోరేషన్
    ధరణి స్థానంలో భూ భారతి పేరుతో అప్ గ్రేడ్ యాప్
    ఏపీ తరహా గ్రామ వాలంటరీ వ్యవస్థకు శ్రీకారం
    గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం
    రేషన్ డీలర్లు కు గౌరవ వేతనం తో పాటు కమీషన్
    ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు
    మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు
    విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్

  • 17 Nov 2023 10:22 AM (IST)

    మధ్యాహ్నం 12.30 గంటలకు మేనిఫెస్టో విడుదల

    టీపీసీసీ ఎన్నికల మేనిఫెస్టో మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల కానుంది. ఉదయం 11 గంటలకు జరగాల్సిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమం 12.30 గంటలకు వాయిదా పడినట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే మేనిఫెస్టో విడుదల చేస్తారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ముఖ్యనాయకులు పాల్గొంటారు.

ట్రెండింగ్ వార్తలు