Medical Colleges: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులు.. మెరిట్ లిస్ట్ విడుదల

గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు, అనస్తీషియా విభాగంలో 44 పోస్టులు, పీడియాట్రిక్స్‌ విభాగంలో 28 పోస్టులు, ఆర్థోపెడిక్స్‌ విభాగంలో 12 పోస్టులు ఉన్నాయి.

  • Published On : March 29, 2026 / 04:15 PM IST

Medical Colleges: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధించిన మెరిట్‌ లిస్ట్ విడుదలైంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం మెరిట్ లిస్ట్ ను విడుదల‌ చేసింది. గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో మొత్తం 174 పోస్టుల భర్తీ చేయనున్నారు.

గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు, అనస్తీషియా విభాగంలో 44 పోస్టులు, పీడియాట్రిక్స్‌ విభాగంలో 28 పోస్టులు, ఆర్థోపెడిక్స్‌ విభాగంలో 12 పోస్టులు ఉన్నాయి. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 1న హైదరాబాద్‌ వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

ఇక 9న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల సెలక్షన్ లిస్ట్ విడుదల కానుంది. 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్‌ను ఏప్రిల్ 9వ తేదీ నాటికి విడుదల చేయనున్నట్టు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాహనదారులకు గుడ్‌న్యూస్.. అవన్నీ ఇక మీ ఇంటికే..