Bandi Bhagirath Case : బండి భగీరథ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. పోలీసులు కీలక నిర్ణయం.. ఈసారి పకడ్బందీగా..
Bandi Bhageerath Case : రాష్ట్ర రాజకీయాల్లో బండి భగీరథ్ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. భగీరథ్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
- Harish Thanniru
- Published on- May 16, 2026 / 01:45 PM IST
Bandi Bhageerath Case
Bandi Bhagirath Case : మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భగీరథ్‌పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. అతనితో టచ్‌లో ఉన్న వారిపై, స్నేహితులు, బంధువుల ఇళ్లపై పోలీసులు నిఘా ఉంచినట్లు సమాచారం. భగీరథ్ కోసం ఐదు పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని నివాసంలో ఒక బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే, తాజాగా.. పోలీసులు లుకౌట్ నౌటీసులు జారీ చేశారు. భగీరథ్ విదేశాలకు పారిపోతాడనే అనుమానంతో.. ఆయన దేశంపాటిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో బండి భగీరథ్ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. భగీరథ్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. ఈ పరిస్థితిలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది.
హైకోర్టులో మధ్యంతర బెయిల్ లభించకపోవడంతోపాటు.. తన అరెస్టుకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పరారీలో ఉన్న బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. న్యాయవాదులతో కలిసి మరికొన్ని గంటల్లో పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ లో అతను లొంగిపోనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో బండి భగీరథ్ పై ఫోక్సో కేసుతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద పేట్ బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అటు బాధిత బాలిక కుటుంబంపై భగీరథ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ టౌటౌన్ పోలీస్ స్టేషన్ లో హనీ ట్రాప్ కేసు నమోదైంది.
