×
Ad

Bandi Sanjay : పవన్ కల్యాణ్‌ సనాతన ధర్మంపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. హిందువులకు కీలక సూచన

Bandi Sanjay : జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు.

Bandi Sanjay

Bandi Sanjay : జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. కూకట్‌పల్లిలో కాపు కులస్తుల ‘కార్తీక వన భోజనాల’ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తరువాత ముస్లింలకు కొమ్ముకాసే దుస్థితి. ఆ ఫలితాల తరువాత హిందువుల్లో కసి పెరిగింది. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాల్సిందే అంటూ సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులారా.. ఘర్ వాపసీ రండి. మీకోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయి. దేవుళ్లను మోసం చేయడం సరికాదు. హిందూ సనాతన ధర్మం గొప్పది.. హిందువుగా పుట్టడం మనందరికీ గర్వకారణం. అన్ని కులాలు తమ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడుతూ హిందూ ధర్మం కోసం పనిచేయాలి. హిందూ సనాతన ధర్మ రక్షణే నా లక్ష్యం అని బండి సంజయ్ అన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తుందని సంజయ్ కీలక కామెంట్స్ చేశారు.