పూల వేడుక : బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌవరం : కేసీఆర్ 

  • Publish Date - September 28, 2019 / 07:02 AM IST

తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ప్రారంభమైపోయాయి. తొలి రోజు ఎంగిలి బతుకమ్మ పండుగను ఆడబిడ్డలకు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలకు సీఎం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలన్నారు.  సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరాధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. బతుకమ్మ పండుగ కోసం దేవాలయాలు, చెరువుల వద్ద అన్ని రకాల ఏర్పాటు చేయాలి అని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.

రంగు రంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి.. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు రోజుకో రకంగా బతుకమ్మలను ముస్తాబు చేసి పూజిస్తారు. ఎంగిలి బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ,నాన బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ,అలిగిన అమ్మ, వేపకాయల అమ్మ, వెన్నముద్దల అమ్మ,ఆఖరి రోజు చివరి రోజు సద్దుల బతుకమ్మతో పండుగ ముగిస్తుంది. ఈ తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలంతా ఆట పాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా బతుకమ్మను ఊరూ వాడ అంగరంగ వైభంగా భక్తి శ్రద్ధలతో జరుపుతోంది.