Beer Price Hike : మందు బాబులకు బిగ్అలర్ట్.. బీర్లు తాగుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..

Beer Price Hike : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధం భారతదేశంలోని చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా త్వరలో బీర్ల ధరలు సైతం భారీగా పెరుగుతాయని చెబుతున్నారు.

Beer Price Hike

  • యుద్ధం ఎఫెక్ట్.. మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్
  • బీర్ల ధరలు భారీగా పెరిగే చాన్స్
  • గ్యాస్ కొరతతో బీరు సీసాల ఉత్పత్తికి అంతరాయం

Beer Price Hike : ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య యుద్ధం భారతదేశంలోని చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే వంటగ్యాస్ కోసం పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను వేధిస్తోంది. తాజాగా.. మందు బాబులపైనా యుద్ధ ప్రభావం పడబోతోంది.. త్వరలో బీర్లకు కూడా తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే భారతదేశంలో ఎండల తీవ్రత ఎక్కువ అవుతుండటంతో బీర్ల విక్రయాలు
పెరుగుతున్నాయి. ఇదే సమయంలో బీర్ల ధరలకు రెక్కలు రాబోతున్నాయి.

Also Read : Gold Price Today : రూ.15వేలు తగ్గింది.. ఏపీ, తెలంగాణలో నేటి బంగారం, వెండి ధరలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అక్కడి నుంచి మనదేశానికి సహజవాయువు సరఫరా చాలా వరకు తగ్గిపోయింది. బీరు సీసాలు తయారు చేసే కంపెనీలు చాలా వరకు గ్యాస్ తోనే నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ కంపెనీలకు గ్యాస్ కొరత ఏర్పడడంతో ఉత్పత్తిని తగ్గించటమో, తాత్కాలికంగా నిలిపివేయటమో చేస్తున్నాయి. బీరు సీసాలతోపాటు ప్యాకేజింగ్ వస్తువులు, లేబుల్స్ ధరలు కూడా పెరిగాయని మద్యం కంపెనీలు చెబుతున్నాయి.

రాయిటర్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో బీర్ల ఉత్పత్తి సంస్థలు చాలా ఉన్నప్పటికీ.. ఈ మార్కెట్ ప్రధానంగా మూడు అంతర్జాతీయ కంపెనీల చేతుల్లోనే ఉంది. హైనకెన్ సంస్థకు మొత్తం మార్కెట్లో దాదాపు 50శాతం వాటా ఉంది. ఏబీ ఇన్‌బెవ్, కార్ల్స్‌బెర్గ్ సంస్థలకు చెరో 19శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ మూడు సంస్థలు కూడా బీర్ల ధరలు పెంచకుంటే ఉత్పత్తి సాధ్యం కాదని చెబుతున్నాయని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో 12శాతం నుంచి 15శాతం వరకు ధరలు పెంచాల్సి ఉంటుందని, లేదంటే ఉత్పత్తి కష్టమవుతుందని బ్రేవరేజ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.

బీర్ల ధరలను పెంచేందుకు ప్రభుత్వాలు ఒప్పుకోకుంటే కంపెనీలు సరఫరాను తగ్గించే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మే, జూన్ నెలల్లో మార్కెట్లో బీర్ల కొరత ఏర్పడవచ్చునని.. ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మందు బాబులకు బీర్ల ధరల రూపంలో వేసవి కాలంలో గట్టి షాక్ తప్పదని తెలుస్తోంది.