Bhadrachalam : భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం.. ప్రత్యక్ష ప్రసారం.. రాములోరికి పట్టు వస్త్రాలను సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
Bhadrachalam : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని ప్రసిద్ధ దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సం వైభవంగా జరుగుతోంది. కల్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
- Harish Thanniru
- Updated on- March 27, 2026 / 12:23 PM IST
Bhadrachalam seetharamula kalyanam
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అభిజిత్ లగ్నం సుముహూర్తమున సీతారాముల కల్యాణం జరుగనుంది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
