Telangana : ఒకే మహిళతో ఇద్దరు.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. ఇంటికి నిప్పు..
Bhadradri Kothagudem district : ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధం ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Published on- August 30, 2026 / 07:52 AM IST
Bhadradri Kothagudem district : ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయంపైలో ఇటీవల ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో తీవ్రగాయాలపాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. అతని కుటుంబ సభ్యులు నిందితుడు ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Suryapet District : సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఇద్దరు ప్రాణాలు బలిగొన్న వేపచెట్టు.. ఎస్ఐకుసైతం తీవ్రగాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంకు చెందిన మౌలానా (42), అదే గ్రామానికి చెందిన ఇస్మాయిల్ ఒకే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయంపై ఈనెల 23న వారిద్దరి మధ్య వివాదం జరిగింది. మౌలానా అడ్డు తొలగించాలని భావించిన ఇస్మాయిల్.. కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి ఒడిగట్టాడు. అయితే, ఇస్మాయిల్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.
మృతుడు మౌలానాకు భార్య సాబీరా, కుమారుడు షారూక్ పాషా, కుమార్తె జాస్మీన్ ఉన్నారు. అయితే, కారుతో ఢీకొట్టిన రోజే మృతుడు సోదరుడు నాగుల్ మీరా ఫిర్యాదు మేరకు పోలీసులు ఇస్మాయిల్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మౌలానా మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో ఇస్మాయిల్ ఇంటికి నిప్పంటించారు. అప్పటికే ఇస్మాయిల్ ఇంట్లో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు. అంతేకాక ఇస్మాయిల్ బావ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. మృతదేహాన్ని తీసుకొచ్చి ఇస్మాయిల్ ఇంటి ముందు ఉంచి ధర్నాకు దిగారు. నిందితుడిని గ్రామం నుంచి బహిష్కరించాలని, అతనికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే.. ఇస్మాయిల్ పై గతంలో పశువుల అక్రమ రవాణా కేసులతో పాటు రౌడీషీట్ కూడా ఉన్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.
