Peddireddy
Peddireddy: పార్టీలో కీలక మార్పులు జరుగుతాయనే ప్రచారం ఊపందుకోవడంతో మాజీ మంత్రి పెద్ది రెడ్డి కాస్త విముఖంగా ఉన్నారట. దీంతో బీజేపీ పెద్దలు పెద్దిరెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారు.
రంగంలోకి దిగిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. యెన్నెం శ్రీనివాస్ రెడ్డితో కలిసి చర్చలు జరిపారు.
ఈటల పార్టీలో చేరుతున్నారని వార్తలు వినిపించడం.. దాదాపు ఖాయమన్నట్లుగానే కనిపిస్తోంది వాతావరణం. ఈటెల చేరికకు బహిరంగంగానే వ్యతిరేక ప్రకటనలు చేసేశారు పెద్దిరెడ్డి. పార్టీ నిర్ణయాలు, మరికొన్ని కీలక విషయాలను ఫోన్ లో మాట్లాడి వివరించారు కిషన్ రెడ్డి.
బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదంటూ సర్దిచెప్పారు. ఈటలను చేర్చుకోవాలని అనుకుంటున్నట్లుగా ముందుగా తనతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరో వారం రోజుల్లో ఈటల బీజేపీలోకి చేరుతున్నందుకే పెద్దిరెడ్డితో డీకే అరుణ సంప్రదింపులు చేపట్టారని వినికిడి. అదేమీ లేదని కరోనా నుంచి కోలుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పరామర్శించేందుకు మాత్రమే వెళ్లారని డీకే అరుణ కార్యాలయ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.