Raghunandan Rao: మహిళా బిల్లు వీగిపోవడం బీజేపీ ఫెయిల్యూర్ కాదా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఎంపీ రఘునందన్ రావు రియాక్షన్ ఇదే..

131వ రాజ్యాంగ సవరణ వీగిపోతే.. తమిళనాడు ఢిల్లీని ఓడించింది అని తమిళనాడు అంటుంది. నేను చేసిన ప్రయత్నం వల్లే 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయిందని తెలంగాణ సీఎం రేవంత్ అంటారు.

  • Published on- April 20, 2026 / 06:11 PM IST

Raghunandan Rao: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. పలు అంశాలపై ఆయన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ”పార్లమెంటులో బీజేపీకి తిరుగులేని ఆధిక్యత ఉంది. తిరుగులేని నాయకుడిగా, ప్రపంచ నాయకుడిగా మోదీని చెబుతున్నారు. అలాంటిది ఈసారి లోక్ సభలో కొంత ఎదురుదెబ్బ తగిలినట్లు అనిపిస్తోంది. మహిళా బిల్లు వీగిపోవడం బీజేపీ ఫెయిల్యూర్ కాదా?” అన్న ప్రశ్నకు రఘునందన్ రావు బదులిచ్చారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

”మాకు 300 మంది ఎంపీలు వచ్చారు. మా సీట్లు మాకు ఉండనే ఉన్నాయి. మరి ఎదురు దెబ్బ ఎక్కడ తాకింది? ప్రతిపక్షానికి ఉన్న 230 ప్రతిపక్షానికి ఉన్నాయి. అక్కడ ఏం మారింది? గణాంకాలు ఏమీ మారలేదు. 131వ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలంటే 2/3 మెజారిటీ కావాలి. ఆ మెజారిటీ లేదు కాబట్టి 131వ రాజ్యాంగ సవరణ లోక్ సభలో వీగింది. ఇదే ఫ్యాక్ట్.

బీజేపీ గురించి ఎప్పుడు మాట్లాడినా ఒక మాట చెప్తాను. మిగతా రాజకీయ పార్టీల మాదిరి మేము ఏది పడితే అది చెయ్యము. ఈ బిల్లు ప్రవేశ పెట్టేకంటే ముందు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీల అధ్యక్షులు, అన్ని పార్టీల నాయకుల ఇళ్లకు వెళ్లారు. బిల్లు ప్రాముఖ్యతను భారత ప్రజలందరి ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం, స్పెషల్ సెషన్ పెడుతున్నాం మీరు సహకరించండి అని కోరారు. ప్రతిపక్ష నాయకుల అందరి ఇళ్లకు పర్సనల్ గా వెళ్లి బిల్లు ఉద్దేశాన్ని వారికి వివరించారు.

131వ రాజ్యాంగ సవరణ వీగిపోతే.. తమిళనాడు ఢిల్లీని ఓడించింది అని తమిళనాడు అంటుంది. నేను చేసిన ప్రయత్నం వల్లే 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయిందని తెలంగాణ సీఎం రేవంత్ అంటారు. కానీ, వాస్తవం ఏంటంటే.. మేము ఓడిపోలేదు. ఇది అర్థం చేసుకోండి. మాకు ఓట్లు తగ్గలేదు. నిజానికి నాలుగు ఓట్లు పెరిగాయి కూడా. మీరు అర్థం చేసుకోవాలి. నిజం నిద్రలేచే సరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందని చెబుతారు. ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నామని, మీడియా కంట్రోల్ లో ఉందని, మనం ఏది చెబితే అదే రాయాలని, మనం ఏది చెబితే అదే వేదం అన్నట్లు పదేళ్లు ఒకాయన చెలరేగిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నారో, ఏమయ్యారో కూడా తెలీదు. రేపు రేవంత్ కు కూడా అదే పరిస్థితి. అధికారం ఆ పొరని ఏర్పాటు చేస్తుంది. ఎదిగిన కొద్దీ ఒదగాలనే సిద్ధాంతం మాది. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాలుగోసారి కూడా ఈ దేశానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అవుతారు” అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

Also Read: బీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..