Raghunandan Rao: బీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..
పదవులు ఇచ్చినా, ఇవ్వకున్నా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల బలం ఉంది. ఒక్కొక్కరు మూడు నాలుగు దశాబ్దాల నుంచి ఏ పదవి లేకుండా కొట్లాడుతున్నారు.
Raghunandan Rao: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. పలు అంశాలపై ఆయన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ”బీఆర్ఎస్, బీజేపీ త్వరలో కలిసిపోతాయి. బీజేపీ నేతలే చాలామంది అంతర్గత చర్చల్లో ఇలా అంటున్నారు. కలిస్తేనే మంచిది. మా దగ్గర లీడర్ షిప్ లేదు. వాళ్ల దగ్గర లీడర్ షిప్ ఉంది” అన్న ప్రశ్నకు రఘునందన్ రావు బదులిచ్చారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
”బీజేపీ ఎదుగుదలను ఆపేందుకు.. బీఆర్ఎస్ నుంచి నాయకులు, క్యాడర్ జారిపోకుండా ఉండేందుకు.. బీఆర్ఎస్ లోని ఒకరిద్దరు నాయకులు వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో రాయిస్తున్నటువంటి వార్తలే ఇవి. అంతే తప్ప బీజేపీకి, బీఆర్ఎస్ కి ఎలాంటి పొత్తు కానీ, పొంతన కానీ ఇప్పటివరకు లేదు. భవిష్యత్తులో కూడా ఉండదని నేను నమ్ముతున్నా.
2014లో బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసేందుకు కూడా నాయకులు లేరు. బీజేపీకి అలా కాదు. మాకు అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. మా కార్యకర్తలు మూడు దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్నారు. మమ్మల్ని ఎవరితోనూ పోల్చద్దు. మాకు కమిట్ మెంట్ ఉంటుంది. మా కార్యకర్తలకి నేషన్ ఫస్ట్ ఉంటుంది. పదవులు ఇచ్చినా, ఇవ్వకున్నా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల బలం మాకుంది. ఒక్కొక్కరు మూడు నాలుగు దశాబ్దాల నుంచి ఏ పదవి లేకుండా కొట్లాడుతున్నారు. మాకేమీ లేదు అని మాట్లాడటం మూర్ఖత్వం అవుతుంది. లీడర్ షిప్ సహా అన్నీ మాకే ఉన్నాయి. మాకే సరిపడ స్ట్రెంత్ ఉంది. వాతావరణం అనుకూలించాలి. దాని కోసం పని చేస్తా” అని రఘునందన్ రావు అన్నారు.
Also Read: MMTS ఉచిత రైలు ప్రయాణం.. సోషల్ మీడియాలో రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ..
