×
Ad

తెలంగాణను రక్షించాలంటే ప్రజలు ఈ పని చేయండి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

ఓట్ల లబ్ధి కోసమే ప్రజలను ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు రెచ్చగొడుతున్నాయని తెలిపారు.

Ramchandra Rao

  • కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిశాయి
  • కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్కాములు
  • నిర్మల్ జిల్లాలో ప్రచారంలో రామచంద్రరావు

Ramchandra Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ నిర్మల్ జిల్లాలో రామచంద్రరావు ప్రచారం చేశారు. గతంలో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సవాల్ విసిరారు.

“నీకు 15 నిమిషాలు.. మాకు 15 సెకన్లు సరిపోతాయి. కానీ, అది మా బీజేపీ సిద్ధాంతం కాదు. బీజేపీ, మోదీ ఆలోచన “సబ్ కా సాత్ సబ్ కా వికాస్”. ఎంఐఎం ఒక బ్రోకర్ పార్టీ. అప్పట్లో బీఆర్ఎస్‌తో, ఇప్పుడు కాంగ్రెస్‌తో ఎంఐఎం ఎన్నికల పొత్తు.

Also Read: రూ.10 కోట్ల లంబోర్గిని కారుతో కోటీశ్వరుడి కుమారుడు రచ్చ రంబోలా.. వాహనాలు ధ్వంసం.. పలువురికి గాయాలు

ఓట్ల లబ్ధి కోసమే ప్రజలను ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు రెచ్చగొడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఉమ్మడి కాపురం చేస్తున్నాయి. ప్రజల కోసం బీజేపీకి ఓటు వేయండి.. తెలంగాణను రక్షించండి. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్కాములు, స్కీముల పేరిట దోచుకుంటున్నారు. నిర్మల్ ప్రజలు విజ్ఞులు.. బీజేపీకి ఓటు వేయండి, అవినీతి రహిత పాలనను స్వాగతించండి” అని అన్నారు.