KTR: రేవంత్‌రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్.. వేలాదిమంది రోడ్డున పడ్డారు.. కాంగ్రెస్ ప్రభుత్వపై కేటీఆర్ ఫైర్
బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
- V Santhosh Kumar
- Updated on- June 14, 2026 / 02:40 PM IST
Brs Ktr sensational comments on cm revanth reddy government
రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్: కేటీఆర్
హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్‌పై విమర్శలు
వేలాది ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం
KTR: బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మొదటి అర్థభాగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల సమయంలో చెప్పిన అనేక హామీలు ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయాల వల్ల వేలాది మంది ఇళ్లను కూల్చివేశారని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పేదలు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని, పరిపాలనలో స్పష్టమైన దిశా నిర్దేశం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు కూడా ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని కేటీఆర్(KTR) ఆరోపించారు. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పొడిచింది కూడా రేవంత్ రెడ్డేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకత్వంలో సమన్వయం లోపించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, భవిష్యత్తులో తగిన తీర్పు ఇస్తారని కేటీఆర్ అన్నారు.
