Telangana Farmers Alert : తెలంగాణ రైతులకు బిగ్ బ్రేకింగ్.. ఆగస్ట్ 19 డెడ్‌లైన్.. అర్జెంట్‌గా ఇలా చేయండి.. లేదంటే డబ్బులు రావు..!
Telangana Farmers Alert : తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. ఆగస్ట్ 19లోగా విత్తనాల వివరాలను డీలర్ వద్ద ఆన్లైన్లో రిజిస్టర్ చేయించుకోండి. రిజిస్టర్ చేసుకున్న రైతులకే క్వింటాల్‌కు రూ.500 బోనస్ లభించనుంది.
Telangana Farmers Alert
- ఆగస్ట్ 19లోగా విత్తనాల వివరాలను రిజిస్టర్ చేసుకోండి
- రిజిస్టర్ చేసుకున్న రైతులకే క్వింటాల్‌కు రూ.500 బోనస్
- రిజిస్టర్ చేయించుకోని రైతులకు ఇబ్బందులు తప్పవు
Telangana Farmers Alert : తెలంగాణ రైతులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. రాష్ట్రం ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. 2026-27 వానాకాలం సీజన్లో సన్న వడ్లు సాగు చేస్తున్న రైతులు అలర్ట్ గా ఉండాల్సిన సమయం.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేయించుకోండి.
ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ కూడా సూచించింది. ఆగస్ట్ 19లోగా ఈ ప్రాసెస్ చేయాలని సూచించింది. ఇలా రిజిస్టర్ చేసుకున్న రైతులకు మాత్రమే సన్న వడ్లపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందనుంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పండించిన రైతులకు సన్న బియ్యం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందుతోంది.
అంతేకాదు.. బోనస్ కోసం 7 వరి రకాలను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), బీపీటీ-5204 (సాంబమసూరి), కేఎన్ఎం-1638 (కూనారం సన్నాలు), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-7715 రకాల్లో ఏదైనా సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా తమ వివరాలను రిజస్టర్ చేయించుకోవాలి.
Read Also : Anganwadi Retirement : అంగన్వాడీ సిబ్బందికి భారీ ఊరట.. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబుల్.. ఎవరికి ఎంతంటే?
విత్తనాలు కొన్న డీలర్ వద్దనే ఈ వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రైతులు విత్తనాలు కొనుగోలు చేశాక రసీదును డీలర్‌కు అందించాలి. ఆపై రైతు వివరాలతో పాటు సాగు చేస్తున్న వరి రకం ఏంటి అనేది కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తారు.
అయితే, రిజిస్టర్ చేయించుకోని రైతులకు ఇబ్బందులు తప్పవు. ధాన్యం విక్రయించే విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రైతులు ఆలస్యం కాకుండా ఆగస్ట్ 19లోగా డీలర్‌ను సంప్రదించి తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం బెటర్.
ఆన్లైన్లో రైతులు తమ వివరాలను రిజిస్టర్ చేయించుకోవాలి. లేదంటే వాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తీసుకోరు. ఇంకా ఒక రోజే సమయం ఉంది. ఆగస్టు 19లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి.
