KTR Political Counter Pawan kalyan : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్‌.. ఆ నిర్ణయం సరైందికాదు..

KTR Political Counter Pawan kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పవన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

KTR Political Counter Pawan kalyan

KTR Political Counter Pawan kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని కాంగ్రెస్‌తోపాటు పలు పార్టీల నేతలపై తీవ్ర స్థాయిలో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులు హైదరాబాద్లో ఎలా అడుగు పెడతావ్..? నీకు ఇక్కడేం పని అని మాట్లాడుతున్నారు.. నన్ను బెదిరించడానికి తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? అంటూ పవన్ ప్రశ్నించారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది.. పోటీచేస్తుందని స్పష్టం చేశారు. అయితే, పవన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read : Gold Silver Price Today : పసిడి ప్రియులకు కీలక సమాచారం.. అక్కడ తగ్గిన గోల్డ్ రేటు.. కారణాలివే..

కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎవరైనా పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలంగాణలో పవన్ పోటీ చేశారు. పవన్ కల్యాణ్‌ను ఏపీ డిప్యూటీ సీఎంగా గౌరవిస్తాం. పవన్ తెలంగాణలో అడుగు పెట్టొద్దని ఎవరూ అనలేదు. తెలంగాణ ఏర్పడినప్పుడు 11రోజులు అన్నం తినలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. అలాంటి పవన్ ఇప్పుడు తెలంగాణ అవతరణ రోజున మీటింగ్ పెడతామనడం సరికాదని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ నాలుగు కోట్ల భూమి పుత్రులది. తెలంగాణ గురించి ప్రేమగా మాట్లాడుతున్న పవన్.. మోదీ జాతీయ వాదం ముసుగులో ఆర్థిక ప్రాంతీయ వాదం చేయడం లేదా? ప్రధానమంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. దేశభక్తి గురించి పవన్ మాకు చెప్పాల్సిన పనిలేదు. పవన్ సినిమా పేరు ఓజీ.. కానీ, తెలంగాణ ఓజీ కేసీఆర్ అంటూ పవన్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.