Telangana Assembly : అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్.. కేటీఆర్ కీలక కామెంట్స్..

Telangana Assembly : ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

BRS MLAs Walk Out of Telangana Assembly Sessions KTR key comments

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో బుధవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చసాగింది. పలు అంశాలపై ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

Also Read : Gold Price Today : భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు మంచి అవకాశం.. నేటి ధరలు ఇవే..

మూసీ నది ప్రాజెక్టుకు సంబంధించి ప్రశ్నోత్తరాలు చేపట్టగా.. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పలు అభ్యంతరాలు లేవనెత్తారు. డీపీఆర్ తయారైతే తమ ముందు పెట్టాలని అన్నారు. దీనికి మంత్రి శ్రీధర్‌ బాబు సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానం ఎవరికీ సంతృప్తిగా లేదని కేటీఆర్ పేర్కొన్నారు. మూసీలో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి మేము తీవ్రంగా వ్యతిరేకమని, అందుకే ఈరోజు సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీలో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి మేము తీవ్రంగా వ్యతిరేకం. అందుకే ఈరోజు సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం. ప్రభుత్వం వద్ద డీపీఆర్ (DPR) ఏది అంటే సమాధానం లేదు. ఎన్ని ఇళ్లు కూలగొడుతున్నారు అనేది కూడా సమాధానం చెప్పడం లేదని కేటీఆర్ అన్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డీపీఆర్ లేదని అంటున్నాడు. ప్రభుత్వం ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రజెంటేషన్ వద్దు, బాధితులతోనే ప్రజలతోనే పెట్టాలని మేము డిమాండ్ చేశాము. అందుకే ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు మేము హాజరు కాలేదని కేటీఆర్ అన్నారు.

మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీనే. ప్రభుత్వం వద్ద డీపీఆర్ ఉంటే వెంటనే ప్రవేశపెట్టాలి. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్ కు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. 1400 ఇళ్లు కూల్చివేస్తామని చెప్పి పదివేల ఇళ్లకు పైగా సంబంధించి నోటీసులిచ్చారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూలగొడుతుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సమాఛారం లేదు. తన సొంత జిల్లాలోనే సమాచారం లేకపోవటం విడ్డూరంగా ఉందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏసీబీ లోన్ లేదన్నారు. ప్రభుత్వం దగ్గర పైసులు లేవు, ప్రణాళిక లేదని కేటీఆర్ అన్నారు.