BRS Party : టార్గెట్‌ ఫిక్స్‌.. గ్రేటర్‌పై కారు స్పీడ్‌ అందుకేనా.? ఈసారి టికెట్లు వారికేనట..

BRS Party Focus On Greater Hyderabad : వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తాచాటేందుకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టార్గెట్ గా పెట్టుకుంది. ఈ మేరకు ఇప్పటికే నుంచే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

BRS Party Focus On Greater Hyderabad

BRS Party Focus On Greater Hyderabad : గ్రేటర్‌లో మూడు కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ రాకపోయినా..ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఎలక్షన్ మూడ్లోకి వెళ్లిపోయాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుంటే..గ్రేటర్‌లో బలపడే ప్రయత్నాల్లో బీజేపీ బిజీగా ఉంది. ఈ పరిస్థితుల్లో తమ కోర్ ఓటు బ్యాంకుతో గ్రేటర్‌లో మూడు పీఠాలను సొంత చేసుకోవాలనే టార్గెట్‌తో బీఆర్ఎస్ దూకుడు పెంచింది.

Also Read : Operation Tiger in Maharashtra : మహారాష్ట్రలో ఆపరేషన్‌ టైగర్‌ షురూ.. ఏంటీ ఆపరేషన్‌ టైగర్.. ఏం జరుగుతోంది? ఉద్ధవ్‌ థాక్రేకు టెన్షన్ ఎందుకు..

బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైమ్ పవర్‌లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఏకంగా 99 కార్పొరేటర్లను గెలుచుకుంది. రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎంతో కలిసి..మేయర్ సీటును కైవసం చేసుకుంది. వరుసగా పదేళ్లు గులాబీ పార్టీ చేతిలోనే మేయర్ సీటు ఉండటంతో..హైదరాబాద్‌తో పాటు, సిటీ శివారులో డెవలప్మెంట్ యాక్టివిటీ బాగానే చేపట్టారు. నార్త్ టు సౌత్..ఈస్ట్ టు వెస్ట్..సిటీలో అన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, కొత్త కొత్త నిర్మాణలు జరిగాయి. దీంతో గ్రేటర్ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మంచి గుర్తింపు దక్కింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడినా..గ్రేటర్‌ పరిధిలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌కు దక్కకపోవడానికి తాము చేసిన అభివృద్ధి, ప్రజలకు తమపై ఉన్న నమ్మకమే కారణమంటున్నారు కారు పార్టీ నేతలు.

ఇప్పుడు ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే గ్రేటర్‌ పరిధిలోనే దాదాపు 55 అసెంబ్లీ సీట్లు ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ 119 సీట్లకే ఎన్నికలు జరిగితే కూడా గ్రేటర్ లిమిట్స్‌లో మొన్న గెలిచిన అన్ని సీట్లు నిలబెట్టుకుంటే తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్నారట బీఆర్ఎస్ అగ్రనేతలు. అందుకే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లలో పార్టీ విస్తరణపై కేటీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి డివిజన్‌పై రిపోర్టులు, సర్వేలు తెప్పించుకుని.. స్థానిక నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయంపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారట. ఈ అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు కేటీఆర్.

ఇప్పటివరకు టికెట్ కోసం పార్టీ పెద్దల చుట్టూ తిరగడం, సిఫార్సులు తెచ్చుకోవడం, రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడం సాధారణంగా కనిపించేది. కానీ ఈసారి ఆ కల్చర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంటే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు.

గ్రౌండ్‌లో కనిపించండి, ప్రజల కోసం పోరాడండి..అప్పుడే పార్టీ గుర్తిస్తుందని..గ్రేటర్ ఎన్నికల టికెట్ ఆశిస్తున్న ఆశావహులకు కేటీఆర్ క్లియర్ కట్‌గా చెప్పేశారు. మాజీ కార్పొరేటర్ అయినా, సీనియర్ నాయకుడు అయినా, యువ నాయకుడు అయినా..అందరికీ ఒకే రూల్ వర్తిస్తుందని అంతర్గత సమావేశాల్లో కేటీఆర్ కుండబద్దలుకొట్టినట్లు చెబుతున్నారట. కేవలం నాయకులతో ఫోటోలు దిగడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం మాత్రమే సరిపోదని స్పష్టం చేస్తున్నారు. మీమీ డివిజన్లలో ప్రజా సమస్యలపై పోరాటం, స్థానిక అంశాలపై ఉద్యమం, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల తరఫున గళమెత్తడం..ఇవే అసలు అర్హతలుగా పరిగణించనున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.

నాయకుల చుట్టూ తిరిగితే కాదు..ప్రజల్లో మధ్యన ఉంటేనే టికెట్ వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పడం పార్టీ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. టికెట్ కోసం అడగకండి. మీ పనితీరే మీ ఇంటికి టికెట్ పంపిస్తుందంటూ కేటీఆర్ ఇచ్చిన కొత్త రాజకీయ ఫార్ములా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్ ఇచ్చిన ఔట్‌రైట్ ఇండికేషన్‌తో మాజీ కార్పొరేటర్లు, యువనేతలు, టికెట్ ఆశావహులందరిలో కొత్త టెన్షన్ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. ప్రజల్లో తిరిగిన వారికే గులాబీ పార్టీ టికెట్ ఇస్తుందా.? లేక ఎన్నికల సమయానికి పాత రాజకీయాలే మళ్లీ తెరపైకి వస్తాయా.? గ్రేటర్ పాలిటిక్స్‌లో గులాబీ పార్టీ కొత్త ఎక్స్‌పరిమెంట్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి మరి.