Telangana Politics : తెలంగాణలో పవర్ కట్‌పై పొలిటికల్ ఫైట్.. బొగ్గు లెక్కలతో బీఆర్ఎస్‌కు ప్రభుత్వ కౌంటర్.. అసలు కథేంటి?
Telangana Politics : బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య విద్యుత్ కోతలు.. బొగ్గు లెక్కలపై ఫైట్ రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది.
- Harish Thanniru
- Updated on- September 24, 2026 / 10:33 PM IST
brs vs congress Political War on telangana power cuts
Telangana Politics : బీఆర్ఎస్ వర్సెస్ ప్రభుత్వం. కరెంట్ కోతలు..బొగ్గు లెక్కలపై ఫైట్ కాక రేపుతోంది. విద్యుత్ కోతలతో రేవంత్ సర్కార్ ఆనాటి రోజులు తెచ్చిదంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. కరెంట్ కష్టాలకు, సాగునీటి ఎద్దడికి ఈ ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ గులాబీ పార్టీ ఎక్స్‌పోజ్ చేస్తోంది. ప్రభుత్వం మాత్రం లెక్కలతో సహా రివర్స్ అటాక్‌కు దిగుతోంది. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు షార్టేజ్‌తో విద్యుత్ ఉత్పత్తి పడిపోయిందని..4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కేవలం 400 మెగావాట్లే ఉత్పత్తి అవుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.
Also Read : Danam Nagender : దానం నాగేందర్‌ను టెన్షన్ పెడుతున్న గత ఉపఎన్నిక..! ఈసారి మంత్రిగా బరిలోకి?
భద్రాద్రి, కొత్తగూడెం ప్లాంట్లలోనూ పవర్ జనరేషన్ తగ్గిందని గులాబీ పార్టీ చెబుతోంది. బొగ్గు లేకపోవడం వల్లే థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గిందని..అందుకే కరెంట్ కోతలు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ వాదిస్తూ వస్తోంది. ఏ ప్లాంట్‌లో బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయి.? ప్లాంట్లకు ఎంత బొగ్గు వస్తోంది.? ఏ గ్రేడ్ బొగ్గు ఎందుకు రావడం లేదు? ఎన్ని విద్యుత్ యూనిట్లు పనిచేస్తున్నాయి.? ఎన్ని యూనిట్లు నిలిచిపోయాయి? ఈ లెక్కలు తేల్చేందుకే ఆరు బృందాలు థర్మల్ ప్లాంట్ల పరిశీలనకు వెళ్లాయి. పవర్ ప్లాంట్లలోకి వెళ్లి బొగ్గు నిల్వలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలను అనుమతించలేదు పోలీసులు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌లోని సింగరేణి జెన్‌కో హెడ్ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ ఆందోళన చేసింది. ఓవైపు రైతుల కరెంట్ కష్టాలు..ఇంకోవైపు ప్రధాన ప్రతిపక్షం రోడ్డుక్కెడంతో..పవర్ వార్ హీటెక్కుతోంది.
బీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తుండటంతో ప్రభుత్వం లెక్కలతో సహా ప్రశ్నలు లేవనెత్తుతూ ఇంకో ట్విస్ట్ ఇస్తుంది. యాదాద్రి ప్లాంట్‌కు G9 గ్రేడ్ బొగ్గు అవసరమైతే..సింగరేణిలో ఆ గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవంటున్నారు అధికారులు. G9 క్వాలిటీ, క్వాంటిటీ బొగ్గుపై ఆధారపడేలా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఎందుకు డిజైన్ చేశారనేది ప్రభుత్వ పెద్దల ప్రశ్న. అంతేకాదు బొగ్గు గనుల దగ్గరే ప్లాంట్ నిర్మించే అవకాశం ఉన్నా..దూరంగా ఎందుకు కట్టారో చెప్పాలంటోంది ప్రభుత్వం. బొగ్గును దూరం నుంచి తరలించేందుకు రాష్ట్రంపై రూ.40 వేల కోట్ల భారం పడుతుందని అంటున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేసేందుకు లాంగ్ టర్మ్‌లో దాదాపు 40 వేల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని అధికారులు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. సింగరేణిలో G9 బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని..ఫ్యూచర్‌లో కూడా ఆ గ్రేడ్ బొగ్గు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్పినట్లు సమాచారం.
యాదాద్రి ప్లాంట్ G9 బొగ్గుపైనే పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేదన్న వాదన కూడా తెరపైకి వచ్చిందట. G13 వంటి తక్కువ గ్రేడ్ బొగ్గును కూడా ఉపయోగించొచ్చని..అయితే కరెంట్ ఉత్పత్తికి ఎక్కువ పరిమాణం ఉన్న బొగ్గు అవసరం పడుతుందని అధికారులు చెప్తున్నట్లు తెలుస్తోంది. బొగ్గు గ్రేడ్ ఒకవైపు..బొగ్గు పరిమాణం మరోవైపు..రవాణా ఖర్చు ఇంకోవైపు..యాదాద్రి పవర్ ప్లాంట్ల్ సరికొత్త లెక్కలు క్లిష్టంగా మారుతున్నాయి. ఇక సింగరేణి బొగ్గు బ్లాకుల అంశం కూడా చర్చకు వస్తోంది. గతంలో బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడంతో G9 గ్రేడ్ బొగ్గు అందుబాటులోకి రాలేదని అధికారులు చెప్పినట్లు ప్రభుత్వం చెబుతోంది. సింగరేణికి చెందిన 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని కూడా అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రస్తుత విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది.
4 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న యాదాద్రి ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో ఎప్పుడు పనిచేస్తుంది.? బొగ్గు సమస్యను ఎలా పరిష్కరిస్తారు.? సింగరేణి నుంచి ఎంత బొగ్గు వస్తుంది.? బయటి సంస్థల నుంచి ఎంత బొగ్గు కొనుగోలు చేస్తారనే ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తోంది సర్కార్. దసరాలోపు యాదాద్రి పవర్ ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపించాలని ఇప్పటికే డెడ్‌లైన్ పెట్టింది. బీఆర్ఎస్ కరెంట్ లెక్కలు తేల్చేందుకు ప్లాంట్లలోకి వెళ్తే..ప్రభుత్వం లెక్కలతో కౌంటర్ ఇస్తోంది. ప్రస్తుతం బొగ్గు ఎందుకు అందుబాటులో లేదన్నది బీఆర్ఎస్ ప్రశ్న. బొగ్గు అందుబాటులో ఉండేలా గతంలో ప్రణాళిక ఎందుకు రూపొందించలేదన్నది కాంగ్రెస్ క్వశ్చన్. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా..బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య నడుస్తున్న పవర్ వార్..కోల్ లెక్కల మంటలు..ఎటు టర్న్ తీసుకుంటాయో..కరెంట్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో చూడాలి మరి.
