Kodangal : సీఎం రేవంత్ నియోజకవర్గంలో దారుణం.. మనిషిని పీక్కుతిన్నాయ్.. కాలు, ముఖం, చెయ్యిని కొరికేస్తుండగా స్థానికులు గమనించి..

Kodangal : వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండల్ నియోజకవర్గంలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపక్కన పడిపోయిన వ్యక్తిపై వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి.

Kodangal constituency

  • వికారాబాద్ జిల్లా కొండంగల్ పట్టణంలో దారుణం
  • రోడ్డుపక్కన పడిఉన్న మనిషిపై వీధికుక్కలు దాడి
  • శరీరభాగాలను పీక్కుతిన్న కుక్కలు.. వ్యక్తి మృతి

Kodangal : వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండల్ నియోజకవర్గంలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో స్పృహతప్పి రోడ్డుపక్కన పడిపోయిన వ్యక్తిని వీధికుక్కలు పీక్కుతిన్నాయి. కొండగల్ పట్టణ శివారులోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం ఈ ఘటన జరిగింది. స్థానికులు గమనించి కుక్కలను తిరిమేసి చూడగా..అ ప్పటికే వ్యక్తి మరణించినట్లు గుర్తించారు.

Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 2.5లక్షల మందికి శుభవార్త.. జూన్ 1 నుంచి ప్రక్రియ ప్రారంభం..

మృతుడి వద్ద ఉన్న ఆధారాలను బట్టి సిద్ధిపేట జిల్లా రామవరం గ్రామానికి చెందిన బ్రహ్మచారి (32)గా గుర్తించారు. బ్రహ్మచారికి దైవభక్తి ఎక్కువ కావడంతో గ్రామంలోని ఓ గుడిలోనే పూజారిగా జీవితం గడుపుతున్నాడు. తరచూ దేశంలోని పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లి రావడం అతనికి అలవాటుగా చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రం చిక్ బల్లాపూర్ కు వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి బయటకు వచ్చాడు. శుక్రవారం సాయంత్రం కొడంగల్ కు చేరుకున్న బ్రహ్మచారి.. అక్కడ అతిగా మద్యం సేవించి పెట్రోల్ బంక్ సమీపంలోనే రోడ్డు పక్కన స్పృహతప్పి పడిపోయాడు.

అర్ధరాత్రి సమయం కావడంతో ఆ ప్రాంతంలో తిరుగుతున్న వీధి కుక్కలు బ్రహ్మచారిపై దాడిచేసి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో శరీరం సహకరించక పోవడం, కేకలు వేసే ఓపిక లేకుండా పోవడంతో కుక్కలు విచక్షణా రహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే, స్థానికులు కొందరు ఈ దృశ్యాన్ని గమనించి కుక్కలను తరిమేసి చూడగా అప్పటికే అతను మృతిచెందాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొడంగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుక్కలు బ్రహ్మచారిపై దాడి చేస్తున్న క్రమంలో స్థానికులు గమనించి అక్కడి వెళ్లగా.. అప్పటికే అతని కాలు, ముఖం, చెయ్యిని కుక్కలు కొరికేశాయి. ఇతర శరీర అవయవాలను కుక్కలు పీక్కుతిన్నట్లుగా స్థానికులు గుర్తించారు. శరీరం గుర్తుపట్టలేనంతగా మారింది. అయితే, మృతదేహం వద్దఉన్న ఆధారాలతో అతని సిద్దిపేట జిల్లా వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆ తరువాత పోస్టుమార్టం నిమిత్తం బాడీని కొడంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.