Car Accident in Meerpet : మీర్‌పేట్‌లో కారు బీభత్సం.. వ్యక్తిని ఢీకొట్టి.. 2కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి.. స్థానికులు అడ్డగించడంతో పరార్..
Car Accident in Meerpet : రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఢీకొట్టడంతో పాటు.. ప్రశ్నించి, కారును అడ్డగించిన వ్యక్తిని 2 కిలోమీటర్లు కారు డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
- Harish Thanniru
- Published on- May 3, 2026 / 01:08 PM IST
Car accident in Meerpet
- మీర్‌పేట్‌లో ఓ కారు బీభత్సం
- బానెట్‌పై వ్యక్తి వేలాడుతూ 2 కి.మీ ఈడ్చుకెళ్లిన డ్రైవర్
- మందమల్లమ్మ జంక్షన్ వద్ద స్థానికులు అడ్డగింత
- కారు వదిలేసి డ్రైవర్ పరారీ.
Car Accident in Meerpet : రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మే1న రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారు బానెట్‌పై వ్యక్తి వేలాడుతున్నా.. డ్రైవర్ కారు ఆపకుండా రెండు కిలో మీటర్లు లాక్కెళ్లాడు. అతను కేకేలు వేస్తూ ఆపమని వేడుకున్నా డ్రైవర్ కనికరం చూపలేదు. చివరికి స్థానికులు అడ్డగించడంతో కారు డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనలో వ్యక్తికి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మే 1వ తేదీన రాత్రి గాయత్రి నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు జిలానీ అతని కొడుకు ఫైసల్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. వెనుకనుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్ పై నుంచి ఇద్దరూ కిందపడ్డారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్, జాలానీకి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో జిలానీపై కారు డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. జిలానీ అడ్డుకున్నాడు. కారు బానెట్ పైకి ఎక్కి కారు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ, డ్రైవర్ మాత్రం కారును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు.
కారు బానెట్‌పై ఉన్న జిలాని కారును ఆపాలంటూ పదేపదే డ్రైవర్ ను కోరాడు. గాయాలతో అరుస్తున్నా పట్టించుకోలేదు. కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు. అలా రెండు కిలోమీటర్లు దూరం జిలానిని కారుతో ఈడ్చుకెట్టాడు. బాలాపూర్ క్రాస్ రోడ్స్ వరకు వేగంగా కారును పోనిచ్చాడు. మందమల్లమ్మ చౌరస్తా వద్ద ప్రయాణికులు అడ్డుకోవడంతో కారును వదిలేసి నిందితుడు పరారయ్యాడు. కారు ఢీకొట్టిన ప్రమాదంలో పైసల్ కు రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
