Kcr Convoy : కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం, 8 కార్లు ఢీ..

కేసీఆర్ మిర్యాలగూడ రోడ్ షోకు వెళ్తుండగా.. వేములపల్లి మండలం కేంద్రం సమీపంలో ఈ ఘటన జరిగింది.

Kcr Convoy : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్ లోని కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఒక్కసారిగా ముందు ఉన్న వాహనం బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న వాహనాలు వరుసగా ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 కార్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కార్ల ముందు భాగం డ్యామేజ్ అయ్యింది. కేసీఆర్ మిర్యాలగూడ బస్సు యాత్రకు వెళ్తుండగా.. వేములపల్లి మండలం కేంద్రం సమీపంలో ఈ ఘటన జరిగింది.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇవాళ్టి నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. అందులో భాగంగా మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఇందులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరారు కేసీఆర్. వేములపల్లి సమీపంలో ఆయన కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ముందు ఉన్న కారు సడెన్ గా బ్రేక్ వేయడంతో వెనుకున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 8 కార్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఆ వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో అక్కడికక్కడే వాటిని ఆపేశారు.

అనంతరం వేరే వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఉలిక్కిపడ్డాయి. కాగా, కేసీఆర్, వాహనాల్లోని ఇతర బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వాహనాలు మాత్రమే స్వల్పంగా ధ్వంసమయ్యాయి.

Also Read : అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన హరీశ్ రావు

 

ట్రెండింగ్ వార్తలు