Mangli Case Update: మంగ్లీపై కేసు.. అడ్వకేట్ సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు.. సెంట్రల్ మినిస్టర్ పేరుతో..
ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్, రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతామని నమ్మించి సుమారు 100 నుంచి 150 మంది వద్ద డబ్బులు సేకరించినట్లు చెబుతున్నారు.
- Naveen
- Updated on- April 12, 2026 / 12:33 PM IST
Singer Mangli Case Advocate Subba Rao Senasational Allegations
Singer Mangli Case: మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు మరో మలుపు తిరిగింది. కేసు నుంచి తప్పుకోవాలంటూ తనను బెదిరిస్తున్నారని అడ్వకేట్ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరిస్తున్నారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్ తో సింగర్ మంగ్లీకి డైరెక్ట్ గా సంబంధం ఉందని అడ్వకేట్ సుబ్బారావు ఆరోపిస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో 10 కోట్ల రూపాయల మోసం చేశారనే ఆరోపణలతో మంగ్లీ, ఆమె సోదరుడు సహా మరో ముగ్గురిపైన ఇప్పటికే కేసు నమోదైంది.
గోకుల నందన ఇన్ ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పెట్టుబడులు సేకరించినట్లు బాధితులు ఆరోపించారు. ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్, రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతామని నమ్మించి సుమారు 100 నుంచి 150 మంది వద్ద డబ్బులు సేకరించినట్లు చెబుతున్నారు. డబ్బులు సేకరించిన తర్వాత నిందితులు పరారయ్యారని పోలీసులను ఆశ్రయించారు. బాధితుల తరపున న్యాయవాది సింగపోగు సుబ్బారావు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు ముందుకు తీసుకెళ్లొద్దని తనపై ఒత్తిడి తెచ్చినట్లు న్యాయవాది ఆరోపించారు. ఈ కేసు విత్ డ్రా చేసుకోవాలని డబ్బు ఆఫర్ చేసినట్లు న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: ‘డైమండ్ డెకాయిట్’ మూవీ రివ్యూ.. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
