Saidabad School Case: హైదరాబాద్‌లో కలకలం.. హిందూ విద్యార్థితో ఖురాన్ ప్రార్థనలు.. సైదాబాద్ స్కూల్‌పై కేసు నమోదు!

హిందూ విద్యార్థులను మతపరమైన ప్రార్థనలు చేయాలంటూ బలవంతం చేస్తున్నారనే ఆరోపణలపై ఒక ప్రముఖ పాఠశాలపై(Saidabad School Case) పోలీసులు కేసు నమోదు చేశారు.

Case registered against Hindu Student Success School over quran prayers

  • హిందూ విద్యార్థితో ఖురాన్ ప్రార్థనలు
  • సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు
  • సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు

Saidabad School Case: హైదరాబాద్‌ నగరంలోని ఒక ప్రైవేట్ పాఠశాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. హిందూ విద్యార్థులను మతపరమైన ప్రార్థనలు చేయాలంటూ బలవంతం చేస్తున్నారనే ఆరోపణలపై ఒక ప్రముఖ పాఠశాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా, విద్యా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లలపై ఇలాంటి మతపరమైన ఒత్తిళ్లు తీసుకురావడం మత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనంటూ బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Smart Ration Cards: తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. త్వరలోనే పంపిణీ!

వివరాల్లోకి వెళితే.. సైదాబాద్‌లోని ‘సక్సెస్ స్కూల్(Saidabad School Case)’లో రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థితో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఖురాన్ ప్రార్థన అయిన ‘సూరా అల్-ఫాతిహా’ చదివించారని బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని ప్రతిరోజూ ఆ ప్రార్థన చదవాలంటూ ఉపాధ్యాయులు ఒత్తిడి చేశారని, దీంతో బాలుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురై ప్రతిరోజూ ఏడుస్తూ ఇంటికి వచ్చేవాడని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, స్కూల్ డైరీలో “Read Surah Fateha” అని హోంవర్క్ కూడా రాసి ఇవ్వడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తమ అనుమతి లేకుండా మతపరమైన బోధనలు చేస్తూ, బాలుడిని వేధింపులకు గురిచేశారని తల్లి తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాల ప్రిన్సిపాల్, మేనేజ్‌మెంట్, సంబంధిత టీచర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే తన కుమారుడికి తగిన రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదైంది. పోలీసులు ప్రస్తుతం ఈ ఉదంతంపై దర్యాప్తు జరుపుతున్నారు.