Gruha Jyothi Scheme: ‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు షాక్.. చేజారుతున్న జీరో బిల్.. ఎల్నినో దెబ్బకు పెరిగిన కరెంట్ బిల్లులు
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'గృహజ్యోతి(Gruha Jyothi Scheme)' పథకం లబ్ధిదారులపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా పడుతోంది.
TELANGANA GRUHA JYOTHI scheme affected due to EL nino
- ఎల్నినో దెబ్బకు కరెంట్ షాక్
- గృహజ్యోతి పథకం లబ్ధి కట్
- పెరిగిన ఉచిత విద్యుత్ బిల్లులు
Gruha Jyothi Scheme: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘గృహజ్యోతి’ పథకం లబ్ధిదారులపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఉచిత విద్యుత్ పరిమితి దాటిపోతుండటంతో వేలాది కుటుంబాలు జీరో బిల్లు అర్హతను కోల్పోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, విపరీతమైన ఉక్కపోత కారణంగా ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్ల వాడకం వేసవి తరహాలోనే కొనసాగుతోంది.
Liquor Prices: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. తెలంగాణలో మద్యం ధరల పెంపు?
పెరిగిన వినియోగం.. చేజారిన జీరో బిల్లు:
భూగర్భ జలాలు అడుగంటడంతో ఇళ్లలో మోటార్లు,(Gruha Jyothi Scheme) బోర్లు ఎక్కువ సమయం నడపాల్సి వస్తోంది. దీంతో నెలవారీ విద్యుత్ వినియోగం ప్రభుత్వం విధించిన 200 యూనిట్ల పరిమితిని దాటుతోంది. ఫలితంగా ఒక్కసారిగా భారీ మొత్తంలో వస్తున్న కరెంట్ బిల్లులను చూసి సామాన్యులు కంగుతింటున్నారు. కొన్ని ప్రాంతాల్లో బిల్లుల విషయంలో వినియోగదారులు విద్యుత్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.
ఎన్పీడీసీఎల్ పరిధిలో 4 లక్షల కనెక్షన్లపై ప్రభావం:
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలోని 18 జిల్లాల్లో జూన్ నెలలో ఏకంగా నాలుగు లక్షల మందికి గృహజ్యోతి లబ్ధి కట్ అయింది. ఇక్కడ మొత్తం 26.54 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, కేవలం 22.59 లక్షల మందికి మాత్రమే జీరో బిల్లులు వచ్చాయి. మార్చి నుంచి జూన్ వరకు ప్రభుత్వం రూ.2355 కోట్ల సబ్సిడీని అందించగా, ఎల్నినో దెబ్బకు ఈ పథకానికి దూరమవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
