Finance Ministry: రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. తెలంగాణకు రూ. 2,102 కోట్లు.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం..

కేంద్రం తాజాగా విడుదల చేసిన నిధుల్లో బీహార్ రాష్ట్రంకు పెద్దపీట వేసింది. అత్యధికంగా ఆ రాష్ట్రంకు రూ. 9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది.

Central Government Funds

Capital Investment: రాష్ట్రాలకు నిధుల కేటాయింపుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. 2023 – 24 ఆర్థిక సంవ‌త్స‌రానికిగాను స్పెష‌ల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫ‌ర్ క్యాపిట‌ల్ ఇన్వెస్ట్ మెంట్ పేరిట ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని కేంద్రం ఈ ఏడాది బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 1.3 ల‌క్ష‌ల కోట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా 50ఏళ్ల‌కుగాను వ‌డ్డీ లేని రుణంగా భారీ మొత్తం రాష్ట్రాల‌కు అందుతుంది. ఈ క్రమంలో 16 రాష్ట్రాలకు రూ. 56,415 కోట్లు విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కేంద్రం తాజాగా ఆమోదం తెలిపిన నిధుల ద్వారా ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, విద్యుత్, రోడ్లు, రైల్వేలతో సహా అనే రంగాల్లో వినియోగించుకొనేందుకు అవకాశం ఉంది. ఈ పథకం కింద జల్ జీవన్ మిషన్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన అనే రెండు ప్రాజెక్టుల రాష్ట్ర వాటానుకూడా చేర్చింది.

Mahmood Ali : ఆ విషయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు- మంత్రి మహమూద్ అలీ

కేంద్రం తాజాగా ఆమోదం తెలిపిన నిధుల్లో బీహార్ రాష్ట్రంకు పెద్దపీట వేసింది. అత్యధికంగా ఆ రాష్ట్రంకు రూ. 9640 కోట్లు కేంద్రం రుణం మంజూరుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంకు 2,102 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు కేటాయింపులు చేయలేదు. అయితే, ఈ పథకాన్ని ఎనిమిది భాగాలుగా కేంద్రం విభజించింది. ఇదిలాఉంటే కేంద్రం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇదే తరహా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ. 95,147.19 కోట్లకు ఆమోదం తెలపగా.. రూ. 81,915.35 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కరోనా మహమ్మారి అనంతరం రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలని కోరడంతో 2020-21 సంవత్సరంలో కేంద్రం ఈ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టింది.

Parvathipuam : రూ.90 లక్షలు ఇస్తే రూ.కోటి ఇస్తారు.. ఆఫర్ అదిరిపోయింది కదూ.. టెంప్ట్ అయ్యారో

రాష్ట్రాల వారిగా కేటాయింపులు ఇలా..

బీహార్ 9,640 కోట్లు, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ 1255 కోట్లు, ఛత్తీస్‌ఘడ్ 3195 కోట్లు, గోవా 386 కోట్లు, గుజ‌రాత్ 3478 కోట్లు, హ‌ర్యానా 1093 కోట్లు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ 826 కోట్లు, క‌ర్ణాట‌క రాష్ట్రంకు 3647 కోట్లు, మ‌ధ్య‌ప్ర‌దేశ్ 7850 కోట్లు, మిజోరాం 399 కోట్లు, ఒడిషా 4528 కోట్లు, రాజ‌స్థాన్ 6026 కోట్లు, సిక్కిం 388 కోట్లు, త‌మిళ‌నాడు 4079 కోట్లు, తెలంగాణ రాష్ట్రం 2102 కోట్లు, వెస్ట్ బెంగాల్ 7523 కోట్లను కేటాయిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు