Chicken Prices : సండే రోజు చికెన్ కొంటున్నారా..? అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్..

Chicken Prices : చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో చికెన్ (స్కిన్‌లెస్) ధర రూ.325కి చేరింది. ఇక నాటుకోడి అయితే కిలో రూ. 750 నుంచి రూ. 800 మధ్య ఉంది.

Chicken Prices

  • చికెన్ ప్రియులకు బిగ్‌షాక్
  • భారీగా పెరిగిన చికెన్ ధరలు
  • కిలో చికెన్ రూ.325పైనే
  • ఎండలు పెరగడం, దిగుమతి తగ్గడం వల్లనే
  • హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ అమ్మకాలు

Chicken Prices : ఆదివారం వచ్చిందంటే చాలు.. ఉదయం నుంచి చికెన్ దుకాణాల వద్ద క్యూ కనిపిస్తుంటుంది. తెలంగాణ వ్యాప్తంగా సండేరోజు చికెన్ తినేందుకు ఎక్కువ మంది నాన్‌వెజ్ ప్రియులు ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో సండే వచ్చిందంటే చికెన్ షాపుల వద్ద సందడి ఉంటుంది. అయితే, ప్రస్తుతం చికెన్ కొనేందుకు సిద్ధమైన వారికి బిగ్ షాకింగ్ న్యూస్. చికెన్ కోసం షాపు దగ్గరకు వెళ్తే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read : Rain Alert : రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలేవానలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు

చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో చికెన్ (స్కిన్‌లెస్) ధర రూ.325కి చేరింది. ఇక నాటుకోడి అయితే కిలో రూ. 750 నుంచి రూ. 800 మధ్య ఉంది. నాలుగు రోజుల్లో చికెన్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల్లోనూ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు చికెన్ కోసం షాపుల వద్దకెళ్లి ధరలు చూసి నోరెళ్లబెట్టాల్సి వస్తోంది.

చికెన్ ధరలు భారీగా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎండ వేడికి కోళ్లు చనిపోతుండటం, కోళ్ల దిగుమతులు తగ్గడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతీరోజూ 10వేల టన్నుల చికెన్ ను విక్రయిస్తుంటారని అంచనా. ఇక దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్ వంటి పండుగల సమయాల్లో రోజుకు 15 నుంచి 16 వేల టన్నుల చికెన్ అమ్ముతుంటారు.

నగరంలోని హోల్‌సేల్ చికెన్ వ్యాపారులతోపాటు చిన్నచిన్న దుకాణదారులు వారం, పదిరోజులకు సరిపడా కోళ్లను కొని పెట్టుకొని చికెన్ విక్రయిస్తుంటారు. ఎండల బాగా ముదరడంతో వీరి దగ్గర ఉన్న కోళ్లు చనిపోతున్నట్లు తెలిసింది. దీంతో తమ వద్ద ఉన్న కోళ్లను రేట్లు పెంచి విక్రయాలు చేస్తున్నారని తెలిసింది.

మార్చి నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.. రానున్న రెండు నెలల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని.. తద్వారా చికెన్ ధరలుసైతం భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కిలో చికెన్ రూ.400కు చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇదే జరిగితే చికెన్ ప్రియులకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు.