Chandrababu Naidu : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. ఏపీలో తాజా పరిణామాలపై చర్చ
Chandrababu Naidu : హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
- Harish Thanniru
- Updated on- May 2, 2026 / 06:05 PM IST
CM Chandrababu Naidu visits Pawan Kalyan residence in Hyderabad
Chandrababu Naidu : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన పది రోజలుగా హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా.. పవన్ కల్యాణ్ ఇంటికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు. సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అనా కొణిదెల స్వాగతం పలికారు. అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, పాలనా పరమైన పలు కీలక నిర్ణయాలపై పవన్‌తో సీఎం చంద్రబాబు చర్చించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పరామర్శించేందుకు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లారు.… pic.twitter.com/8ELGXBjJfb
— JanaSena Party (@JanaSenaParty) May 2, 2026
